DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 6 నుంచి భద్రాచలంలో నవరాత్రి ఉత్సవాలు 

*108 మందితో  విజయదశమి శ్రీ రామాయణ పారాయణ*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2021 (డిఎన్ఎస్):* దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతి గాంచిన  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 6 నుంచి 15 వరకూ 
శరన్నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా విజయదశమి శ్రీ రామాయణ

పారాయణ మహోత్సవములు వైభవంగా నిర్వహిస్తున్నారు. 

శ్రీ శ్రీ ప్లవ నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య ది: 06-10-2021 బుధవారం నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి ది: 15-10-2021 శుక్రవారం వరకు చిత్రకూట మండపం లో అష్టలక్ష్మీ అలంకారములు వైభవోపేతంగా ఆకట్టుకోనున్నాయి.  

06-10-2021 న : ఆది లక్ష్మి అలంకారము,   బాలకొండ పారాయణము

 

07-10-2021 న : సంతానలక్ష్మి అలంకారము, అయోధ్యకాండ పారాయణము

08-10-2021న :  గజలక్ష్మి అలంకారము, అయోధ్యకాండ పారాయణము

09-10-2021 న : ధనలక్ష్మి అలంకారము, అరణ్య కాండ పారాయణము

10-10-2021న : ధాన్య లక్ష్మి అలంకారము, కిష్కింధకాండ పారాయణము

11-10-2021న : విజయలక్ష్మి అలంకారము,  సుందరకాండ పారాయణము

12-10-2021

న : ఐశ్వర్య లక్ష్మి అలంకారము , యుద్ధకాండ పారాయణము

13-10-2021 న :  వరలక్ష్మి అలంకారము , యుద్ధకాండ పారాయణము

14-10-2021 న :  మహాలక్ష్మి అలంకారము, యుద్ధకాండ పారాయణము

చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరమ్, ఏకైక మక్షరం భీకం మరో పాతక నాశనమ్

శ్రీరామాయణ పారాయణ ములను తొలగించి సభలను ప్రసాదించు

కల్పవృక్షము ఈ పారాయణమును భద్రాచల క్షేత్రమున చైత్ర శుద్ధ పాడ్యమి నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు ప్రయుక్తముగానూ, ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి  శుద్ధ నవమి వరకు శరన్నవరాత్రి ప్రయుక్తంగానూ ఏడాదికి రెండు మార్లు నవాహ్నికంగా జరుపుట ఆచారముగా వస్తోంది.

ఈ శరన్నవరాత్రి వేడుకల్లో శ్రీరామాయణ పారాయణ

మహోత్సవమును 108 మందితో సామూహిక పారాయణముగా పదిరోజుల పాటు నిర్వహిస్తున్నారు. దీనిలో కుల-లింగ-వయో-వర్గ భేదం లేకుండా అందరూ నికి శ్రీ భద్రాద్రి రాముని సేవగా ఈ పారాయణలో పాల్గొనవచ్చును. ఏ ప్రాంతం - భక్తి శ్రద్దలతో పారాయణలో పాల్గొనే వారికి పది రోజుల పాటు ఉచిత వసతి, భోజనం సౌకర్యములతో పాటుగా దర్శనము ప్రసాదము అనుగ్రహ పాత్రలను

దేవస్థానం అందజేస్తుంది. పారాయణ చేసిన వారికి ఎటువంటి పారితోషికం ఇవ్వదు. కేవలం శ్రీరామ సేవగా మాత్రమే పారాయణ చేయాలి. ఆసక్తిగల భక్తులు వెబ్ సైట్ www.bhadrachalamonline.com లో దరఖాస్తు చెయ్యవచు. లేదా Email tend_bhadrachalamityahoo.co.in) ద్వారా పంపవచ్చును. 

విశేష కార్యక్రమములు

అక్టోబర్  7 నుంచి 15 వరకూ  ప్రతి రోజు ఉదయం 11 గంటలకు చిత్రకూట

మండపంలో సంక్షేప రామాయణ హోమం జరుగుతుంది. 

15-10-2021 విజయ దశమి రోజున గం॥ 11-30 ని॥లకు శ్రీరామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా శ్రీరామ మహాపట్టాభిషేకము, సా॥ గం॥ 4-00లకు శ్రీ భక్తరామదాస నిర్మితమైన దసరా మండపమున విజయోత్సవము (శమీపూజ) మరియు శ్రీరామ లీలా మహోత్సవము జరుగుతుంది. వివరాలకు  9866743100 సంప్రదించగలరు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam