DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆ సీట్లో వేరేమతస్తులు ఉన్నా ఇదే జిఓ ఉంటుందా?

*ప్రశ్నార్ధకంగా  మారుతున్న టిటిడి వెసులుబాటు జీవోలు*      
 
*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2021 (డిఎన్ఎస్):* టీటీడీ ట్రస్ట్ బోర్డ్ కోసం ప్రత్యేక  ఆహ్వానితుల కోసం జీవో లు విడుదల అవుతుంటాయి. వీటి ద్వారా కొంతమందిని టిటిడి సభ్యులుగా నియమిస్తుంటారు. టిటిడి చట్టం ప్రకారం కేవలం

హిందూ సాంప్రదాయ పరులను మాత్రమే బోర్డు లోగానీ, ఉద్యోగాల్లో నియమించాలి. అయితే. ఈ ఆహ్వానితుల్లో తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి నగర పాలక సంస్థ చైర్మన్ కూడా ఉంటారు. అయితే ఈ పోస్ట్ ల్లో ఎన్నికయ్యే వారు హిందువులు మాత్రమే ఉండాలి అనే నిబంధన లేదు ఎవరైనా ఎన్నిక కావచ్చు.  ఈ పోస్ట్ ల్లో ఎన్నికయ్యే వారు క్రైస్తవులు గానీ, ముస్లిం లు

గానీ అయితే. . టీటీడీ కోసం విడుదలయ్యే జీవో ప్రకారం వీళ్ళు ఆహ్వానితులుగా ఉండే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో ఈ జీవో లాక్ వీసులుబాటు ఉంటుందా? లేదా ఈ పోస్ట్ ల్లో కేవలం హిందువులని ఎంపిక చేస్తారా అనేది పాలకులు తెలియాల్సియుంది. అయితే ఇంతవరకూ ఆ ఇబ్బంది కలగలేదు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam