DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీటీడీ లో 50 మంది ఆహ్వానితుల జంబో జిఓకి హైకోర్టు బ్రేక్

*ఇది భక్తుల విజయం: బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2021 (డిఎన్ఎస్):* టీటీడీ లో 50 మంది ఆహ్వానితుల జంబో జిఓకి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు బ్రేక్  వేస్తూ మూడు వారాల పాటు స్టే విధించడం వెంకన్న భక్తుల విజయం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.

భానుప్రకాష్ రెడ్డి అన్నారు.  

కోట్లాది మంది హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీనివాసుని దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రం మారుస్తూ ఏకంగా 81 మందిని టీటీడీ ట్రస్ట్ బోర్డు కు నియమించడాన్ని తప్పుపడుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె. భానుప్రకాష్ రెడ్డి హైకోర్టు లో వ్యాజ్యం దాఖలు చేసారు. దీనిపై

బుధవారం విచారణ జరిపి టిటిడి లో ఇంతమంది ఎందుకో చెప్పాలంటూ ఈ జీవోలను మూడు వారాల పాటు స్టే విధించింది. 

ఈ సందర్బంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టిటిడి చట్టాలను తుంగలోకి తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ప్రత్యేక జీవో లను విడుదల చేస్తూ 50 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించిందన్నారు.  ఇంతవరకూ 170

సార్లు రాష్ట్ర  ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా జ్ఞానోదయం కలగడం లేదు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam