DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*హెరాయిన్ తరలింపులు ఎపీలో జరగలేదు: అధికారులు*

*మాదక ద్రవ్యాల రవాణా లో కీలక వ్యక్తి ద్వారపూడి వాసా?* 

*రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గుజరాత్ లో పట్టివేత* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 22, 2021 (డిఎన్ఎస్):* ఆప్ఘనిస్థాన్ నుండి ఢిల్లీ కి తరలిస్తున్న రూ.9 వేల కోట్ల విలువైన 3000 కిలోల హెరాయిన్‌ ను (

మాదకద్రవ్యాలు ) గుజరాత్ లో పట్టు బడిన ఘటనలో ఏ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరపలేదని, ఈ మాదక ద్రవ్యాల తరలింపు ఆంధ్రకు సంబంధం లేదని రాష్ట్ర అధికారులు తెలియచేస్తున్నారు. 

నిఘావర్గాల పరిశోధనలో విస్తుపోయే విషయాలు తెలిసినట్టు సమాచారం. ఈ మాదక ద్రవ్యాల ముసుగుకు మూలాలు తేలింది తూర్పు గోదావరి జిల్లా మండపేట

వాసితోనే. దీనికి సంబంధించి మండపేట మండలం ద్వార పూడి కి చెందిన మాచవరం సుధాకర్‌ ను అరెస్ట్ చేసి విచారణకు తరలించినట్లు తెలుస్తోంది. 

అత్యంత ప్రమాదకరమైన ఈ సరుకు పట్టివేతలో ఒక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి వాసి కావడం తో జిల్లా నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. 

దోషుల కార్యకలాపాలు

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరపలేదని, ఈ మాదక ద్రవ్యాల తరలింపు ఆంధ్రకు సంబంధం లేదని రాష్ట్ర అధికారులు తెలియచేస్తున్నారు. అయినప్పడికి కూడా వీటి ప్రభావం జిల్లాలో ఏ మేరకు ఉంది అనే విషయం పై అధికార వర్గాలు విస్తృత పరిశోధన చేస్తున్నారు. జిల్లా లో మాదక ద్రవ్యాల రవాణా, వాడకం తదితర అంశాలపై కూపీ

లాగుతున్నాయి. 

అఫ్గానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని దిల్లీకి చేర్చాలనుకున్నారు. నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని సుధాకర్ ప్రారంభించారు. దాన్ని చీకటి

కార్యకలాపాలకు వినియోగించినట్లు దర్యాప్తు సంస్థ లు నిర్ధారణకొచ్చాయి. ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌ ఇందులో పాత్రధారి కావడంతో ఇప్పుడు ఈ అంశం జిల్లా లో సంచలనం గా మారింది. తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని పోలీసులు

చెబుతున్నారు. 

ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్‌ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతై.. కాకినాడ పోర్టు ద్వారా దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 

ఈ నెల 15న  గుజరాత్ లోని ముంద్రాలో హెరాయిన్‌ పట్టుబడిన

వెంటనే డీఆర్‌ఐ అధికారులు సత్యనారాయణపురంలోని సుధాకర్‌ అత్తవారింట్లో సోదాలు జరిపారు. అయిదు రోజుల కిందట సుధాకర్‌, అతని భార్య వైశాలిని అదుపులోకి తీసుకుని, వివిధ అంశాలపై ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మదాబాద్‌, దిల్లీ, చెన్నై నగరాల్లో సోదాలు నిర్వహించారు. భార్యాభర్తలిద్దరితో పాటు

మరికొందర్ని  అరెస్టు చేశారు. 

పోర్టుల్లో లాజిస్టిక్ కార్యకలాపాల నేపద్యం తోనే. . . 

ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ కొన్నాళ్లు విశాఖపట్నంలో ఉద్యోగం చేశారు. తర్వాత చెన్నైకు వెళ్లి, ఎనిమిదేళ్లుగా అక్కడే ఉన్నారు. ఓ సిమెంట్‌ కంపెనీలో లాజిస్టిక్‌ మేనేజర్‌గా, కస్టమ్స్‌ హ్యాండ్లింగ్‌,

ట్రక్కింగ్‌, స్టీమర్‌ ఏజెన్సీ బిజినెస్‌, కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్స్‌ తదితర కార్యకలాపాలు నిర్వహించే ఓ ప్రఖ్యాత సంస్థలో మేనేజర్‌గా పనిచేశారు. పోర్టుల్లో ఎగుమతి దిగుమతులు, కస్టమ్స్‌ అనుమతులతోపాటు అక్కడ సాగే అక్రమ వ్యవహారాలపైనా పట్టు సాధించారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాల ముఠాలతో పరిచయం ఏర్పడిందని, వారి

సూచన మేరకే సుధాకర్‌ ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని ప్రారంభించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కంపెనీ ఎగుమతి- దిగుమతి కోడ్‌ (ఐఈసీ)ని తమకు ఇస్తే భారీ మొత్తంలో కమీషన్‌ చెల్లిస్తామనడంతో సుధాకర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి ఐఈసీని పొంది దాన్ని మత్తు ముఠాల సభ్యులకు అందజేసినట్లు

భావిస్తున్నాయి. వారు ఆ పేరు ఉపయోగించుకుని భారత్‌లోకి హెరాయిన్‌ దిగుమతి చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. ఈ వ్యవహారంలో టెర్రర్‌ ఫండింగ్‌ (ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం)ఉందనే కోణం లో కేంద్ర నిఘా బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. 

చిరునామా బెజవాడ.. బిజినెస్ చేసేది చెన్నై

లో 

బియ్యం, పండ్లు తదితరాల హోల్‌సేల్‌ వ్యాపారం చేసేందుకు కంపెనీ పెడుతున్నట్లు సుధాకర్ రిజిస్ట్రేషన్‌ సమయంలో విజయవాడ చిరునామా ప్రకటించారు. 

సుధాకర్‌ భార్య గోవిందరాజు దుర్గా పూర్ణ వైశాలి విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం ప్రాంతం వాసి. ఆ చిరునామాతోనే ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని

సుధాకర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. తన అత్తవారింటిని అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందం చేసుకుని లైసెన్సు పొందారు. బియ్యం, పండ్లు తదితరాల హోల్‌సేల్‌ వ్యాపారం చేసేందుకు కంపెనీ పెడుతున్నట్లు రిజిస్ట్రేషన్‌ సమయంలో పేర్కొన్నారు. 

ఆ ఇంటిపై ‘ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ’ అని రాసి, జీఎస్టీఎన్‌ నంబర్‌ వేసి

ఉన్న చిన్న కాగితం మాత్రమే అంటించి ఉంది. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. వ్యాపారం చేయడానికి డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్సును కూడా విజయవాడ కార్పొరేషన్‌ నుంచి తీసుకోలేదు. చెన్నై కేంద్రంగానే సుధాకర్‌ కార్యకలాపాలన్నీ నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ద్వార పూడి తో ఈ కేసుకు ఏమైనా సంబంధాలు

ఉన్నాయా అనేదానిపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి.

ఇలాంటి మాదక ద్రవ్యాల పట్టివేత ఘటనలో జిల్లా పేరు పైకి రావడంతో జిల్లా యంత్రాంగ అప్రమత్తమయ్యింది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam