DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిఓ 439 ద్వారా శ్రీకాకుళం అర్చకుల పేర్లు నమోదు చెయ్యండి

*జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు పద్మనాభ చార్యులు వినతి*

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, సెప్టెంబర్ 22, 2021 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిఓ నెంబర్ 439 ప్రకారం వంశపారంపర్య అర్చకుల పేర్లను ప్రాపర్టీ రిజస్టర్ 43 మరియు 43/10  నందు నమోదు చెయ్యాలని కోరుతూ ఏపీ అర్చక సమాఖ్య

శ్రీకాకుళం జిల్లా శాఖా అధ్యక్షులు శ్రీ భాష్యం పద్మనాభ చార్యులు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా అర్చక ప్రతినిధులతో కలిసి శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖా సహాయ కమిషనర్ కు ఒక వినతి పత్రం అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయశాఖ కమీషనర్ ఆగస్టు 18, 2021 న ఆదేశాలను అన్ని జిల్లాల సహాయ కమీషనర్ లకు పంపించండం

జరిగిందన్నారు. ఈ ఆదేశాలను జిల్లాలో పూర్తి స్థాయి లో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. తమరు మండలాల  కార్యనిర్వహణ  అధికారులకు, మేనేజర్లకు, ఇన్ స్పెక్టర్లకు, పరిశీలనాది అధికారులకు త్వరిత గతిన ఆదేశాల పంపించి 43 మరియు 43/10 లో నమోదు చేయించవలసినదిగా కోరడం జరిగిందన్నారు.  

అర్చకులకు పెండింగ్

వేతనాలు ఉన్నాయని సత్వరం విడుదల చెయ్యాలని కోరామన్నారు.  ధూప దీప నైవేద్యం పధకంలో పెండింగ్ లు నిధులను వెంటనే అర్చకుల ఖాతాలో వెయ్యడం జరుగుతుందని సహాయ కమీషనర్ తెలిపారన్నారు. 

 ఈ బృందం లో ఉత్తరాంధ్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు సింగరాచార్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మన్ పండ, ఉపాధ్యక్షులు పెద్దింటి

రమణాచార్యులు, సూర్య నారాయణ చౌదరి,  అర్చక సమాఖ్య ప్రతినిధులు ఉన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam