DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో బ్రాహ్మణకార్పొరేషన్ ను బీసీ సంక్షేమం లో కలిపేశారు 

*మరి బ్రాహ్మణులకు BC రిజర్వేషన్లు కూడా ఇస్తారా?*

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ ను రెవెన్యూ (దేవాదాయ శాఖా) విభాగం నుంచి వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం లోకి బదిలీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజపత్రం విడుదల

చేసింది. ఇంతవరకు ఈ AP బ్రాహ్మణ కార్పొరేషన్ ను దేవాదాయ శాఖ పరిధిలో ఉండేది, తద్వారా అర్చకులు, ఆలయాల సిబ్బంది ల్లో అధిక శాతం ఈ సామాజిక వర్గంలోనే ఉన్నందున వీరి సమస్యపై పరిష్కారానికై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కు వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమం లో కలపడం వల్ల  ప్రతి సమస్యకూ పరిష్కారం అంత

సులభం గా ఉండే అవకాశం లేదు. 

బ్రాహ్మణా కార్పొరేషన్ ను దేవాదాయ శాఖా  నుంచి బీసీ సంక్షేమ విభాగం లోకి  కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా బీసీ విభాగం లో ఇచ్చే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉందా అని బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam