DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నడిచే దేవుడు కపిలేశ్వరపురం జమిందార్ . . .నమో నమ:

 *శ్రీ ఎస్.బి.పి. బి.కే. సత్యనారాయణరావు జన్మ శతాబ్ది ప్రత్యేకం*  

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* హైందవ సంప్రదాయంలో కపిల గోవుకు ఎంత ప్రాశస్త్యం,  వైభవం ఉన్నాయో. . నడిచే దేవునిగా వేలాదిమందిచే కొనియాడ బడుతున్న కపిలేశ్వరపురం జమిందార్లకు అంతే

ప్రాశస్త్యం, వైభవం ఉంది.  

ప్రస్తుత తరాలకు చిరపరితులైన శ్రీ ఎస్.బి.పి. బి.కే. సత్యనారాయణరావు గారు కూడా ఆ వంశంలోని వారే. వీరు జన్మించి శతవత్సరాలు కావడం తో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. 
వీరి సేవలకు కృతజ్ఞతగా డిఎన్ఎస్  అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో

వేదపాఠశాలలు, విద్యా సంస్థలు, సంగీత శిక్షణ నిలయాలు నేటికీ ఎటువంటి లోటూ లేకుండా కొనసాగుతూ వేలాది మంది విద్యార్థులు వేదం, ఆధునిక విద్య, సంగీత, నృత్య రంగాల్లో రాణిస్తున్నారంటే. . ప్రధాన కారణం కపిలేశ్వరపురం జమిందారులే. పూర్వీకుల ఆశయాలకు అనుగుణంగా అదే సంప్రదాయాన్ని పాటించడంలో వీరికి వీరే సాటి. 

వీరి

సంస్థానంలో అనుబంధం ఉన్నవారు, అభిమానులు, వీరి చే స్థాపించబడిన విద్యాసంస్థల్లో శిక్షణ పొందిన వారు వేదాదిగా వీరిని స్మరించుకుంటున్నారు అంటే వీరు చేసిన సేవ ఎంతమంది కి జీవితాలను అందించిందో తెలుస్తోంది. వీరి గురించి. . .క్లుప్తంగా 

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన జమిందార్ లు జిల్లా స్థాయి

నుంచి జాతీయస్థాయి వరకూ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లకు ప్రత్యేక స్థానం ఉంది.

జమిందార్ లు  శ్రీ బలుసు బుచ్చి సర్వారాయుడు, లక్ష్మీ వెంకట సుబ్బమ్మారావు దంపతుల చిన్న కుమారులైన శ్రీ సత్యనారాయణరావు  23 సెప్టెంబర్ 1921 న జన్మించారు. వీరు తన ప్రాథమిక విద్యను కపిలేశ్వరపురంలోను, ఉన్నత పాఠశాల విద్యను

పిఠాపురం రాజాస్ హైస్కూల్, కాకినాడలో మరియు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ (ఇప్పుడు చెన్నై) పూర్తిచేశారు.  

సత్యనారాయణరావు 1953 జూలై 8న కపిలేశ్వరపురం గ్రామ అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. 

ప్రెసిడెంట్, కపిలేశ్వరపురం గ్రామ పంచాయతీ మరియు కపిలేశ్వరపురం సమితి అధ్యక్షుడు నుండి తన

రాజకీయ క్యారియర్‌ను ప్రారంభించారు. 1959 నవంబర్‌ 1న కపిలేశ్వరపురం పూర్వపు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పదవిని చేపట్టి 1964 వరకూ కొన సాగారు. 1958 నుంచి 1964 వరకూ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. 

1964 సెప్టెంబర్‌ 11 నుంచి –1976 వరకూ రెండు పర్యాయాలు (12 సంవత్సరాలు) తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశాడు.

సర్కార్స్ గ్రాండ్యుయేట్స్ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈ సమయంలో అతను ఆంధ్రా యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు గా కూడా కొనసాగారు.  

తన 25 ఏట కపిలేశ్వరపురం ఉత్పత్తిదారుల, వినియోగదారుల సహకార సంఘానికి అధ్యక్షునిగా సుమారు ఇరవై ఏళ్లు పనిచేశారు. సత్యనారాయణరావు అఖిలభారత స్థాయిలో

ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా పనిచేశారు.  శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా 3 సంవత్సరాల పాటు పని చేసారు. 

1999 లో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికై వాజ్ పేయీ కేబినెట్‌ లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.  

పెద్దాపురం లో  ఎస్ ఆర్ వి బి

 ఎస్ జె బి మహారాణి కళాశాల ను 1967 లో నెలకొల్పారు 
శ్రీ సర్వారాయ ధార్మిక విద్య  ట్రస్ట్  ను నెలకొల్పి హిందూ ధార్మిక గ్రంధాలను ముద్రించారు. 

1959  లో చెల్లూరు లో శ్రీ సర్వారాయ సుగర్స్ ను, కాకినాడ లో సర్వారాయ టెక్స్ టైల్స్ పేరుతొ స్పిన్నింగ్ మిల్స్ ను నెలకొల్పారు. 

1973 సంవత్సరంలో

సత్యనారాయణరావు రెండు విద్యా సంస్థలను ప్రారంభించారు.  శ్రీ సర్వారాయ హరికథా పాఠశాల మరియు పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న అయన స్వగ్రామం కపిలేశ్వరపురంలో శ్రీ సర్వారాయ వేద పాఠశాలలను ప్రారంభించారు. సంస్కృత హరికథలు కూడా ఇక్కడ బోధిస్తారు.  వేదపాఠశాల బాగా పనిచేస్తోంది మరియు దాని ప్రస్తుత 34 మంది విద్యార్థులు కృష్ణ

యాజుర్వేద (తైత్తరీయ శాఖ) మరియు అధర్వ వేద (శౌనకీయ శాఖ) శిక్షణ పొందుతున్నారు. 

డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏప్రిల్ 1 , 2006  తేదీన హరికథా పాఠశాలను సందర్శించి నృత్య విభాగాన్ని ప్రారంభించారు. 

ఎపి స్టేట్ గవర్నమెంట్ ఎంపిక చేసింది శ్రీ వైఎస్ఆర్  సాధన పురస్కారం. శ్రీ సత్యనారాయణరావు  21-01-2011 న 90 సంవత్సరాల

వయస్సులో స్వల్ప అస్వస్థత తర్వాత తుది శ్వాస విడిచే వరకు ఈ రెండు సంస్థలను వ్యక్తిగతంగా చూసుకునేవారు.  వేద పఠనం ద్వారా ఉదయం సెషన్, హరికథలు మరియు భక్తి కీర్తనల ద్వారా పండ్ల నారు మరియు సాయంత్రం సెషన్ ప్రసంగాలు మరియు నాటడం.

వీరు పెద్ద సోదరులు ఎస్‌ బీ ప్రభాకర పట్టాభిరామారావు కూడా కేంద్ర సహాయ మంత్రులుగా

పనిచేశారు.  టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలోని తొలి ఆంధ్ర రాష్ట్ర మంత్రి వర్గంలో పట్టాభిరామారావు విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత బెజవాడ గోపాలకృష్ణ మంత్రి వర్గంలోనూ పనిచేశారు. తరువాత కాలంలో ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. ఐదవ

(1971), ఆరవ (1977), ఏడవ (1980)  లోక్‌ సభలలో సభ్యుడిగా ఉన్నారు. 1955లో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా పనిచేసిన పట్టాభిరామారావు 1953లో ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 

ఉదారులు సంస్కృతి సాంప్రదాయాలు మూర్తీభవించిన సఛ్ఛీలురు వదాన్యులు ఆర్ష సంప్రదాయ పరిపోషకులు నిరతాన్న దాతలు

పండిత కవి కళాపోషకులు వేద ధర్మ పరిరక్షకులు నైనదివ్య శ్రీ శ్రీ బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్య నారాయణరావు జమిందార్ శత జయంత్యుత్సవ సందర్భముగ అజరామర యశఃకాయులకు మా శుభాభినందన వందన శత సహస్ర శుభాంజలి ఆచంద్రతారార్కము ప్రజ్వలిలవలె. 
-తంగిరాల శర్మ

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam