DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జల వనరుల శాఖా నుంచి జిల్లా పరిషత్ కు. విప్పర్తి

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 25, 2021 (డిఎన్ఎస్):* జలవనరుల శాఖలో ఇంజనీరుగా జీవితం నుంచి నేరుగా ప్రజా సేవ చేసేందుకు నేరుగా జిల్లా పరిషత్ లోనే అడుగు పెట్టారు విప్పర్తి వేణుగోపాలరావు 

అంబాజీపేట మండలం లోని నందంపూడి గ్రామానికి చెందిన వేణుగోపాలరావు డిసెంబర్ 28న

జన్మించారు. తల్లిదండ్రులు రామ్మోహన్ రావు, కామాక్షమ్మ. విద్యను ధవళేశ్వరం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను,  శ్రీ కందుకూరి వీరేశలింగం హైస్టిక్ జూనియర్ కళాశాలలో పూర్తి చేసి, కాకినాడ జెఎన్టియులో సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు.  

డిగ్రీ వచ్చిన 15 రోజులకే జలవనరుల శాఖ ఇంజనీరింగ్ విభాగం ధవళేశ్వరం కాటన్

బ్యారేజ్ ఈ నిర్మాణంలో జూనియర్ ఇంజనీర్ గా విధులను చేపట్టారు. ఐదేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టు ఏఈఈగా,  డీఈఈగా వశిష్ఠ. క్వాలిటీ కంట్రోల్ (కొయ్యిలగూడెం) గాను,  పోలవరం ప్రాజెక్టులలో ఈఈలుగా పనిచేశారు.  2010 లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉన్న సమయంలో గోదావరిలో రబీకి పూర్తిస్థాయిలో సాగునీరందించారు.  గోదావరికి

రికార్డుస్థాయిలో వచ్చినప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ జేఈగా సమర్ధవంతంగా విధులు నిర్వహించారు. 2009 నుంచి పదవీ విరమణ చేసే వరకు రూ.3,500 కోట్లతో చేపట్టిన గోదావరి డెల్టా ఆధునీకరణ పనుల్లో కీలక భాగస్వామ్యం వహించారు. అనంతరం 2012లో ఉద్యోగ విరమణ చేశారు.

2012 లో పదవి విరమణ అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరారు.

పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు. వై. ఎస్. షర్మిల, వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రల్లో చురుగ్గా పాల్గొన్నారు. జగన్ పట్టిసీమ పర్యటనకు వచ్చిన సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ పై అప్పటి ప్రతిపక్ష నేత ఉన్న సీఎం జగన్ కు గోదావరి సిస్టం గురించి వివరించడం

జరిగింది. 

ఇటీవల పి.గన్నవరం మండలం నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో 9,534 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam