DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బోద‌వ్యాధి నిరోధానికి డిఇసి మాత్ర‌ల పంపిణీ ప్రారంభం

*విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయనగరం, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* బోద‌వ్యాధి రాకుండా ఉండేందుకు ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా, డిఇసి మాత్ర‌ల‌ను మింగాల‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి

కోరారు.  స్థానిక ఘోషా ఆసుప‌త్రిలోని జిల్లా బోద‌వ్యాధి నివార‌ణా కార్యాల‌యం వ‌ద్ద‌, ఫైలేరియా నివార‌ణ మాత్ర‌లను మ్రింగించే మూడు రోజుల కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభించారు. స్వయంగా తాను కూడా మాత్ర‌ల‌ను తీసుకున్నారు.

             ఈ సంద‌ర్భంగా

డిఎంఅండ్‌హెచ్ఓ ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ, వ్యాధి చికిత్స కంటే నివార‌ణ మేల‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాలో బోద వ్యాధిని నిర్మూలించేందుకు ప్ర‌తీఏటా డిఇసి మాత్ర‌ల ఉచిత‌ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఒకేసారి జిల్లాలోని అంద‌రికీ మాత్ర‌ల‌ను పంపిణీ చేసి, మ్రింగించ‌డం ద్వారా,

ఈ వ్యాధి రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. జిల్లాలో కొన్ని చోట్ల ఫైలేరియా వ్యాధి ఉంద‌ని, వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌తో పాటు, శ‌స్త్ర‌చికిత్స‌లు కూడా చేస్తున్నామ‌ని చెప్పారు.  వ్యాధి వ‌చ్చిన త‌రువాత బాధ ప‌డేకంటే, ఇది రాకుండా ముంద‌స్తుగా డిఇసి మాత్ర‌ల‌ను తీసుకోవడం మేల‌ని

సూచించారు.
          రెండు సంవ‌త్స‌రాల లోపు వాళ్లు, గ‌ర్భిణిలు, కేన్స‌ర్‌, అల్స‌ర్‌, కిడ్నీ త‌దిత‌ర దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తులు మాత్రం ఈ మందులు వాడ‌కూడ‌ద‌ని చెప్పారు. 2-5 ఏళ్లు మ‌ద్య‌వ‌య‌సు వారు ఒక డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్‌, 6-14 మ‌ధ్య వ‌య‌సువారు రెండు డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్

మాత్ర‌లు, 15 ఏళ్లు పైబ‌డిన‌వారు 3 డిఇసి, ఒక ఆల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను తీసుకోవాల‌ని చెప్పారు. డిఇసి మాత్ర‌ల‌ను నేరుగా మ్రింగాల‌ని, ఆల్బెండ‌జోల్ మాత్ర‌ల‌ను చ‌ప్ప‌రించ‌డం గానీ, లేదా న‌మిలి మింగాల‌ని డిఎంఅండ్‌హెచ్ఓ సూచించారు.
     
          జిల్లా మ‌లేరియా అధికారి

ఎం.తుల‌సి మాట్లాడుతూ, డిఇసి మాత్ర‌ల‌ను  ఆహారం తీసుకున్న త‌రువాత ఈ మాత్ర‌మే మింగాల‌ని సూచించారు. ఎవ‌రికైనా కొద్దిగా జ్వ‌రం, వాంతులు వ‌చ్చేట‌ట్టు అనిపించినా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. జిల్లాలో ఈ విడ‌త‌ 23,42,048 మందికి డిఇసి, ఆల్బెండ‌జోల్‌ మాత్ర‌ల‌ను  పంపిణీ చేయాల‌ని

ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. దీనికోసం ఆశా, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, వ‌లంటీర్లు, ఎఎన్ఎంతో 9,472  బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అలాగే ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు 948 మంది ఆరోగ్య‌సిబ్బందిని సూప‌ర్‌వైజ‌ర్లుగా నియ‌మించిన‌ట్లు డిఎంఓ తెలిపారు.

 

         ఈ కార్య‌క్ర‌మంలో అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, సీనియ‌ర్ ఎంట‌మాల‌జిస్ట్ డి.సాంబ‌మూర్తి, మ‌లేరియా క‌న్స‌ల్టెంట్ రామ‌చంద్రుడు, అర్బ‌న్ ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam