DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి సైక్రియాటిస్టు రామారెడ్డి కి న్యాయశాస్త్రంలో డాక్టరేట్

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* నిత్యవిద్యార్థి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రామారెడ్డి ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా ఇన్నేళ్లు వేచిన తరువాత బుధవారం  వచ్చింది. ఇప్పటికే విభిన్న కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ అందుకున్న ఆయన తాజాగా   న్యాయశాస్త్రంలో

పి. హెచ్. డి. పొందారు. డాక్టర్ రామారెడ్డికి పి. హెచ్. డి. ఇస్తున్నట్టు దామోదరంసంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ (విశాఖపట్నం) నోటిఫికేషన్ వెలువరించింది.  దీంతో డాక్టర్ రామారెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ,  "నేరాలకువిధించేశిక్షలకు, మానసిక వ్యాధిగ్రస్తులు ఎంతవరకూ బాధ్యులు?" అనే అంశంపై తాను   చేసిన  పరిశోధనకు

డీఎస్ ఎన్ ఎల్ యు  అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి .పి. నందిని  గైడుగా వ్యవహరించారని తెలిపారు. ఆమె నా కుమార్తెవయసువారైనా, నా పట్లమాతృప్రేమ, రాజీపడని క్రమశిక్షణ తో పర్యవేక్షించారని ఆయన తెలిపారు. థీసీస్లో ఏ ఒక్కఅక్షరం మాగురువు గారి కళ్ళబడకుండా, చర్చించబడకుండా బయటకురాలేదంటే అతిశయోక్తికాదని తెలిపారు. 
థీసిస్

సబ్మిట్ చేసి,   రెండేళ్లయినప్పటికీ కూడా, మధ్యలో కరోనా విశ్వ విజృంభణ కారణంగా,  విదేశాలలోమూల్యాంకనం, పబ్లిక్ వైవా-వోసి, కౌన్సిల్ మీటింగ్ లో  ఆమోదం పొందడం లాంటి అడుగులు పడటానికి ఇన్నేళ్ళుపట్టిందని డాక్టర్ రామారెడ్డి తెలిపారు. 
జీ.ఎస్.కే.యం. లాకాలేజీలో 24 సబ్జెక్ట్ మెడల్స్, బహుమతులతో (బెస్ట్అవుట్ గోయింగ్

స్తూడెంట్ మెడల్ తో సహా) ఎల్ఎల్.బి. చేశానని .ఆ తర్వాత న్యాయశాస్త్రంలో 5 పీజీ డిగ్రీలు చేసానని . టార్ట్స్ అండ్  క్రైమ్స్లో ఒక ఎల్ఎల్.ఎమ్, సైబర్ లా  అండ్ ఇంటలెక్చు వల్ ప్రాపర్టీ రైట్స్ లో  ఇంకొక ఎల్ఎల్.ఎమ్,  కాన్స్టిట్యూషనల్ అండ్  అడ్మినిస్ట్రేటివ్స్ లో  
మరొక ఎల్ఎల్.ఎమ్, లేబర్ లాస్ మీద  మరో ఎల్ఎల్.ఎమ్,

కార్పొరేట్  అండ్ సెక్యూరీటీస్ మీద   వేరొక ఎల్ఎల్.ఎమ్. చదివినట్లు ఆయన వివరించారు.  యూని వర్సిటీ ఫస్టవడం కారణంగా పోయినేడాది అచార్యనాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవంలో, ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిస్వభూషణ్ హరిచరణ్ చేతులమీదుగా   బంగారుపతకం స్వీకరించినట్లు డాక్టర్ రామారెడ్డి తెలిపారు.  ఇంకొక ఎల్ఎల్.ఎమ్. కూడా

రాబోయే స్నాతకోత్సవంలో మరోబంగారుపతకంరావచ్చునని (వచ్చినమార్కుల అధారంగాఅంచనా) ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
  "నేను న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యాభ్యాసాలుచేసినా. బార్ కౌన్సిల్ లో  రిజిస్టర్ చేసుకుని, కోర్టుల్లోవాదించే అడ్వకేట్నుకాను. అలాచెయ్యాలంటే, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్  వదులుకోవాలి.

రెండువృత్తులనూ ఒకేసారి కొనసాగించడానికి రూల్స్ ఒప్పుకోవు" అని డాక్టర్ రామారెడ్డి తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam