DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిమ్మల్ని పదవి నుంచి పంపే సమయం ఆసన్నమైంది 

*రా. .. బయటకు రా. . మీరా -  మేమా తేల్చుకుందాం. .*

*141 గుళ్లపై దాడి జరిగితే దోషిని పెట్టుకోడం చేతకాలేదు* 

*మీ లెక్కలు అప్పచెప్తాం : వైకాపా కు జనసేనాని హెచ్చరిక* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* నికార్సైన నిబ్బద్దతకు తిలోదకాలిచ్ఛేసి, ఆంధ్ర

ప్రదేశ్ లో రాక్షస రాజకీయం చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న మిమ్మల్ని పదవి నుంచి పంపే సమయం ఆసన్నమైందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బుధవారం మంగళగిరి లో జనసేన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అయన ప్రసంగించారు. ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నేతల్లాగా సిసలైన ప్రసంగం చేసారు. ఎవరిని వ్యక్తిగతంగా

దూషించ కుండా మీరో - మేమో బహిరంగంగా తేల్చుకుందామని  అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ సందర్బంగా అయన చేసిన ప్రసంగంలో కొన్ని ఝలక్ లు. . 

నేను పూజించే హిందూ ధర్మానికి సంబంధించిన 141 గుళ్లపై దాడి జరిగితే దోషిని పెట్టుకోడం చేతకాని వాళ్ళు పాలకులు ఎలా అవుతారు. పైగా ఆ

దేవాలయాలను మాత్రమే ప్రభుత్వ గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళు ఎదుటివాళ్ళకు నీతులు చెప్తున్నారన్నారు.  

ప్రతి ఒక్కరిని గుర్తు పేట్టుకుంటానన్నారు.  నా ఓర్పు ని కొంత వరకు ఉంటుంది , తరువాత ఎలా కొట్టలో కూడా తెలుసునన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతి ఒక్కళ్ళకీ ప్రతిఫలం తిరిగి

ఇచ్చేశామన్నారు. 

వైసీపీ వాళ్ళు గ్రామ సింహాలు - నా దృష్టిలో  గ్రామ సింహం అంటే కుక్కలు, వీధి కుక్కలు ,పిచ్చి కుక్కలు, ఉర కుక్కలు , ఎక్కువగా వాగి పళ్ళు రాలించుకునే కుక్కలు అన్నారు. 

వైసీపీ  వాళ్ళకి డబ్బు, మదం అహంకారం పుష్కలంగా ఉన్నాయి ..భయం లేదు , భయం ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా

నన్నారు. 

వైసీపీ వాళ్ళని బయటకు ఈడ్చి కొడతాం ,లేదంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షలు పడతాయన్నారు. 

మీకు ఒక్క భాషలో తిట్టడమే వచ్చు.  నాకు నాలుగు భాషల్లో తిట్టడం వచ్చునన్నారు. 

వైసీపీ వాళ్ళనినేను  వివేకానంద హత్య పైన అడుగుతుంటే ,నా పెళ్లి గురుంచి మాట్లాడుతున్నారని ఎద్దేవా

చేసారు. 

వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగత జీవితం గురుంచి మాట్లాడారు ,నేను మాట్లాడగను కానీ నాకు సంస్కారం ఉందని జనసేనాని హేళన చేసారు. 

వైసీపీ వాళ్ళు మా కుటుంబ సభ్యులను సిగ్గులేకుండా నానా మాటలు అన్నారు. అయితే నేను గానీ, జనసేన సభ్యులు, నా అనుచరులు గానీ మీ వైకాపా వాళ్ళ కుటుంబాలను ఒక్క మాట కూడా అనం అని

మీకు మాట ఇస్తున్నానన్నారు.  

నేను ఒక్కడినే రాజకీయాలో ఉన్నా. మా నాన్న ముఖ్యమంత్రి కాదు , నాకు ఫార్మ్ హౌస్ లు లేవు, రుబాధ పడితే నేను సహించను,  రాష్ట్రము కోసం ఇతర పార్టీ లతో కలిసి ఉన్నానన్నారు. 

రాజకీయం నాకు బాధ్యత నేర్పిందని, రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేస్తానన్నారు. 

సైన్యం లో కష్ట

పడితే ప్రెసిడెంట్ మెడల్ వస్తుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో రూ. 500 కె వస్తుందన్నారు. రాజకీయాల్లో నా బీజం , చాలా సుక్షం గా రాజకీయాలు పరిశీలించను అందుకే రాజకీయాల్లో వచ్చానన్నారు.  

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు గాని హత్య లు ఆత్మహత్య లు, వివేకానంద మూర్ధర్ లు, కోడి కత్తులు

ఉన్నాయన్నారు 

ప్రతి పక్షం గా అడగడం నా బాధ్యత ,కానీ ప్రతి సన్యాసి తిడుతున్నారని, అందరూ తిడితే నేను ఏడుస్తూ  ఉంటా అనుకుంటూ ఉన్నారేమో,  మరింత బలంగా తయారు అవుతాను.. 

అమ్మ పథకం ,నానా పథకం ఏంటి ఇవ్వని , ఎవరి డబ్బులు ఇవ్వని .! 

ఉదయం లేచిన ద్గగరా నుంచి పడుకునే దాకా టాక్స్

కడుతున్నాము 

అన్ని టాక్స్ లు కటి , కేంద్ర ప్రభుత్వం చేరిన తరువాత మనకి పంచాలి ..కానీ వీళ్ళు ఎవరు ఓట్ వేస్తున్నారు , మన వాళ్ళు ఎవరు అని పథకాలు ఇస్తున్నారు 

పవన్ కళ్యాణ్ ఎవరికి భయపడే వ్యక్తి కాదు... తోలు తీస్తా 

వైసీపీ నాయకులుకుమర్యాద ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. 

వైసీపీ

నాయకులకు సినిమ హాల్ లు ఎక్కువగా ఉన్నాయి ..టికెట్ డబ్బులు నాకు కాదు, మీ నాయకులే వస్తాయి ...

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కి నాకు 15 లక్షలు అప్పు చేశాను ..

భారతి సిమెంట్ ఫ్రీ గా పంచండి 

రోడ్డు పక్కన పూలు అమ్ముకనే వల్ల దగ్గర , మటన్ షాప్ వల్ల దగ్గర  డబ్బులు అడుకోండి...

వైసీపీ

వాళ్ళు కుక్కలు అరుపులు లాగా అరుస్తారు 

వైసీపీ వాళ్లు పిల్లికి బిక్షం కూడా వేయరు 

ఏదయినా అడిగితే గుంజుకుంటారు.. వీళ్ళు మాత్రం మనల్ని అనొచ్చు 

ఆంధ్రప్రదేశ్  మీ ఇడుపులపాయ ఎస్టేట్ కాదు .....తస్మాత్ జాగ్రత్త

వానలేని మబ్బుకు అరుపులు ఎక్కువ లాగా ఉంది ...వైసీపీ

పాలన 

రోడ్డు వేయడం చేత కాదు.. కానీ కేకలు వేస్తారు అడిగితే .

నేను రెండు చోట్లా ఓడిపోతే జగన్ నన్ను ప్రమాణ స్వీకారం కి పిలిచిన రోజు చెప్పాను. మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నను అని అదే మాట పైన నిలబడి ఉన్నామన్నారు. 

జీతాలు, పెన్షలు ఇవ్వడం చేత కాదు, ◆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

అయిందన్నారు. 

మీకు ఆడబిడ్డ లు ఉన్నారు ...నన్ను తిట్టే తప్పుడు మీ కుటుంబం సబ్యలు గుర్తురారా అని అడిగారు. 

నేను కోట్లు టాక్స్ కట్టి సినిమా రంగంలో నుంచి రాజకీయాల్లో వచ్చాను, నేను ప్రజారాజ్యం లో మా అన్నయ్య వెనుక ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ మా పక్క పార్టీ వారు నడపడకుండ చేశారు. 

జనసేన కి

వర్గ శత్రువులు దౌర్జన్యం చేసే వాళ్ళు, దష్టికం చేసిన వాళ్లే ..వాళ్ళు ఏ కులం లో ఉన్న వదలను 

ఆంద్రప్రదేశ్ లో 151 సీట్లు వస్తే ప్రభుత్వం చాలా బాగా ఉండాలి.. కానీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ...
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam