DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేన తో కటీఫా కు బీజేపీ సిద్ధమా? లేక ఒంటరి చేసే యత్నమా?

*రావాలి సోము - పవన్ అన్నారు, మరి పవన్ కి మద్దతులేదేంటి?*

*మిత్రధర్మానికి బీజేపీ తూట్లు పొడిచిందా? పవన్ కు మద్దతేదీ?*

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 29, 2021 (డిఎన్ఎస్):* భారతీయ జనతా పార్టీ మిత్రధర్మానికి తూట్లు పొడించిందా? లేక కటీఫ్ చెప్పే యోచనలో ఉందా? జనసేన

అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా దండయాత్ర చేస్తుంటే. .అతనికి మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ నేతలు నోరు మెదపక పోవడానికి కారణాలేంటి? రాజకీయ పరంగాను, వ్యక్తిగతంగానూ పవన్ ను ఒంటరి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న బహిరంగ విమర్శలను కనీసం ఖండించడానికి కూడా బీజేపీ

నేతలు నోరు ఎత్తడం లేదు అంటే. . వాళ్ళ వ్యక్తిగతం మాకు అనవసరం, అతని తరపున ఓట్లు వస్తే మంత్రం ఎంజాయ్ చేస్తాం అనే ధోరణిలోనే వీళ్ళ వైఖరి కనపడుతోంది. 

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా సోము వీర్రాజు కూడా పవన్ సామాజిక వర్గానికే చెందినవాడు కావడం గమనార్హం. వైకాపా మంత్రులు పవన్ ను కులం పేరుతొ అవహేళనగా

మాట్లాడినా కూడా సోము వీర్రాజు నోరెత్తక పోవడం చూస్తే. . జనసేన తో మిత్రత్వానికి తూట్లు పొడిచినట్టే. పార్టీ పరంగా ఖండించక పోయినా కనీసం వ్యక్తిగతంగానైనా సంఘీభావం ప్రకటించవచ్చు. అయినప్పడికి. .. గత ఐదు రోజులుగా పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నా అసాంఘికపరమైన ఆరోపణల దాడి పై ఒక్కడు కూడా బీజేపీ నుంచి పవన్ కు మద్దతు పలుకక పోవడం

గమనార్హం. 
ఇదే పెద్దమనుషులు పోవాలి -  - బాబు - జగన్   ..  రావాలి సోము - పవన్ అంటూ నినాదాలు చేసిన రాష్ట్ర బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ సైతం కిమ్మనకపోవడం చూస్తే. . పోవాలి పవన్ అనేందుకు సోము బ్యాచ్ రంగం సిద్ధం చేసుకున్నట్టుగానే కనపడుతోంది. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam