DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయశాఖను రద్దు చేయాల్సిందే, శ్రీవైష్ణవ సంఘం డిమాండ్

*తిరుపతికి చేరిన మన దేవాలయాలు మనకే పాదయాత్ర* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 03,  2021 (డిఎన్ఎస్):* గాడితప్పిన హిందూ దేవాలయ వ్యవస్థను సక్రమ మార్గంలో పెట్టాలంటే ఏకైక పరిష్కారం హిందూ దేవాదాయశాఖకు రద్దు చేయాల్సిందేనని అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన

కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధి నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కల్గించాలని డిమాండ్ తో భాగ్యనగరం నుంచి బయలు దేరిన మన దేవాలయాలు మనకే అనే నినాదం తో ప్రారంభించిన మహాపాదయాత్ర తిరుపతి కి చేరుకుంది.
శనివారం తిరుపతి లో ఈ యాత్ర కు అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణా సంక్షేమ సంఘం

జాతీయ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైందవ సభ్యులందరి కలిసి తిరుపతి గోవిందరాజ స్వామి గుడి నుంచి నిరసనలు చేస్తూ ర్యాలీగా తరువాత అలిపిరి గరుడాళ్వర్ దగ్గరకు చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ​మీడియా అయన మాట్లాడుతూ మన సనాతన సంప్రదాయాలను కాపాడే వారధులుగా, విద్యాలయాలుగా, వర్ణవ్యవస్ధ ఐక్యతకు

నిదర్శనంగా, అన్నదాన నిలయాలుగా ఉండి భారతదేశంలోనే అద్భుతమైన వ్యవస్ధగా దేవాలయం ఉండేదన్నారు.  
అటువంటి సువ్యవస్ధితమై ఒక బిచ్చగాడు, దొంగ కూడా లేడని సాక్షాత్తు అనాటి గవర్నర్ జనరల్ మెకాలే బ్రిటిష్ పార్లమెంటుకి 1835 లో తెలపడమే మన మనకు నిదర్శనమన్నారు.  అటువంటి వ్యవస్థని వారి నిరంకుశత్వానికి బలిచేసేలా ఆనాడు ఈ

ఎండోమెంట్ చట్టం తీసుకువస్తే దానిని ఈనాటి ఈ సంకుచిత ప్రభుత్వాలు కొనసాగించడం దారుణమన్నారు. అటువంటి అధ్బుత వ్యవస్థ మళ్లీ తిరిగిరావాలంటే మన దేవాలయాలను మనమే నిర్వహించుకోవాలని అప్పుడే దాతల ఆశయాలు నెరవేరతాయని పిలుపునిచ్చారు. 
ఈ పాదయాత్ర మహా ధార్మిక యాత్రగా మారి ఉభయ రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలోని విస్తృత

పర్యాటన జరిపి, హిందూ సంఘాలు, మెడికల్, న్యాయం మొదలైన అన్ని వర్గాల వారితోను ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించి, సంతకాల సేకరణ ద్వార, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, ఉన్నత న్యాయస్ధాన ప్రధాన న్యాయమూర్తి కి వినతి పత్రం అందజేస్తామని రాష్ట్రపతి అవార్డు గ్రహీత పిటిజివి రంగాచార్యుల తెలిపారు.  

తుళ్లూరు మఠం

మఠాధిపతి ప్రసాదాచార్యులు మాట్లాడుతూ తమిళనాడు వంటి చాలా రాష్ట్రాలు దేవదాయ శాఖను రద్దు చేసాయని, వివిధ హైకోర్టు, సుప్రింకోర్టు తీర్పులలో కూడా దేవాదాయ శాఖ అస్తిత్వాన్ని ప్రశ్నించాయని వాటి కొనసాగింపు అనైతికమని చెప్పాయని అయినా కూడా ప్రభుత్వాలు స్వార్ధంతో కొనసాగిస్తున్నాయన్నారు. 

భగవద్రామానుజ సంక్షేమ

సంఘం అధ్యక్షులు డి.ఎస్.ఎన్.వి ప్రసాద్ సారధ్యంలో jarigina ఈ మహా పాదయాత్ర భాగ్యనగరం లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద బయలుదేరి తిరుపతికి చేరుకుంది. 

ఈ కార్యక్రమంలో శ్రీవైష్ణవ సంఘం జాతీయ  కోశాధికారి అకలంకం పార్ధసారధి, కృష్ణాజిల్లా శాఖ కోశాధికారి విజయ్ భాస్కర్,  వివిధ హిందు సంఘాల ప్రతినిధులు  తదితరులు

పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam