DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాదక ద్రవ్యాలు అమ్మితే కఠిన చర్యలు : గుంటూరు ఎస్పీ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 05,  2021 (డిఎన్ఎస్):* గుంటూరు అర్బన్ పరిధిలో ( ప్రభుత్వ నిషేధం లో ఉన్న )  గుట్కా, మత్తు పదార్ధాలు విక్రయాలు జరిపితే చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు అర్బన్ ఎస్పీ కె ఆరిఫ్ హఫీజ్ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల  మేరకు గుంటూరు అర్బన్ జిల్లా పరిధి అంతటా

ఆపరేషన్ గుట్కా కొనసాగుతోంది. 

ఈ క్రమంలో గుంటూరు అర్బన్ జిల్లా లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరదులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీస్ అధికారులు గుట్కా స్ధావరాలు,  పాన్ షాపులతో పాటు ఫాన్సీ స్టోర్స్ పేరుతో ఉన్న మరి కొన్ని చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. అర్బన్ జిల్లా వ్యాప్తం గా జరిగిన ఈ తనిఖీల్లో  భారీ

స్ధాయిలో గుట్కా, జర్దా,  సిగరెట్ ప్యాకెట్ లను  (ప్రభుత్వ నిషేధం లో ఉన్న) మంగళగిరి రూరల్ , మంగళగిరి టౌన్, లాలాపేట, అరండల్ పేట, చేబ్రోలు, పత్తిపాడు  పోలీస్ స్టేషన్లలో 15,203 గుట్కా ప్యాకెట్లను,1636 సిగరెట్ ప్యాకెట్ లను సీజ్ చేసి ,16 మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వాటి విలువ మొత్తం ₹2,13,982  ఉంటుందని పత్రికా

ప్రకటన ద్వారా తెలిపారు.

గుట్కా , గంజాయి, మద్యం , లాంటివి ఎవరైనా విక్రయాలు జరిపితే వారి సమాచారం 100 కు ఫోనె చేసి ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా లో ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్య కలపాలకు తావివ్వకుండా ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలని కోరారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam