DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం రాహుల్ దృష్టికి తీసుకుని వెళ్తా 

*(DNS report : సత్య గణేష్ BVS, స్టాఫ్ రిపోర్టర్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్  లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ దృష్టి కి తీసుకుని వెళ్లినట్టు కేంద్ర మాజీ మంత్రి  చింత మోహన్ తెలిపారు. బుధవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో అయన మాట్లాడుతూ రాహుల్  త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ చిత్త శుద్ధి లేదు.కేవలం పత్రికలు, టివి లో ప్రచారం కోసమే మాట్లాడుతున్నారన్నారు. ఉత్తర ప్రదేశ్ లో మా కాంగ్రెస్పా ర్టీ  ఇబ్బందులు ఎదురుకొంటోందని, బాబ్రీ మసీద్ ఘటన తరవాత కాంగ్రెస్ అక్కడ నష్ట పోయిందన్నారు.

అక్కడ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో తెలియడం లేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి బాగోలేదని, పార్టీకి అనుకూలంగా లేదన్నారు. 

ఇప్పటికి దేశాన్నినెహ్రు ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న సోషలిస్ట్ నిర్ణయాలు  నడిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. 

రాష్ట్ర విభజన కు కారకుడు వై ఎస్ రాజశేఖ రెడ్డేనన్నారు.

పార్టీ లో పైచేయి కోసం జరిగిన రాజకీయ కోణం లో తెలంగాణ అంశం తెరపైకి తీసుకువచ్చారన్నారు. అయితే దీని వలన రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరిగిందన్నారు.  2004 లో రాజశేఖర్ రెడ్డి సీఎం అవ్వడమే, ఇప్పుడు జగన్ సీఎం అవ్వడానికి నాందీ అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam