DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశానికే మణిమకుటం విశాఖపట్నం పోర్టు ట్రస్టు

*విశాఖ పోర్టు ట్రస్టు 88 వ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకం*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, అక్టోబర్ 06,  2021 (డిఎన్ఎస్):* అఖండ భారత దేశ ఆర్థిక, వాణిజ్య, వ్యాపార రంగాల్లో మణిమకుటంగా నిలిచింది విశాఖపట్నం పోర్టు ట్రస్టు. అక్టోబర్ 7 వ తేదీన 88 వ 
ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ ఆర్ధిక సంవత్సరం లో

సంస్థ సాధించిన విజయాలు ఇవే. 

ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు 33.41 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. గత ఏడాది ఇదే సంవత్సరానికి 32.70 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసింది. కరోనా సమయంలో సైతం 2 శాతం వృధ్ధిని నమోదు చేసింది.

గత ఏడాది ఇదే సమయంలో పోల్చుకుంటే ధర్మల్ కోల్ (161 శాతం) ,

స్టీమ్ కోల్ (45 శాతం) మరియు కంటైనర్ రవాణా (7శాతం) మేర పెరుగుదల నమోదైంది.

2021-2022 ఆర్ధిక సంవత్సరంలో చేపట్టనున్న ప్రాజెక్టులు

కాలుష్య నివారణను కవర్డ్ స్టోరేజ్ యార్డుల నిర్మాణ పనులను పోర్టు ప్రారంభించనుంది. 36.38 కోట్ల అంచనా వ్యయంతో డ్రెయిన్లు, రోడ్లు, నీటి సరఫరా వంటి అవసరమైన అన్ని మౌలిక వసతులతో నవంబర్ లో

పనులను ప్రారంభించనున్నారు.

21.47 కోట్ల రూపాయలతో పోర్టు ప్రవేశ మార్గంలోని కెనాల్ లో ఓఆర్ఎస్ జెట్టి మరమ్మత్తు, పునర్నిర్మాణ పనులను నవంబర్ నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు.

96.05 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణ పనులకు సంబంధించి, మౌలిక వసతుల అభివృద్ది ఇతర వసతులకు సంబంధించి

సెప్టెంబర్ 24న కేంద్ర పోర్టులు నౌకా జలరవాణా శాఖ సహాయమంత్రి శ్రీ శంతను ఠాకూర్ శంకుస్ధాపన చేశారు.

22.04 కోట్ల రూపాయలతో పోర్టులోని 45.143 టికెఎం పొడవైన రైల్వే లైన్ల విద్యుదీకరణకు సంబంధించిన పనులను జులై 2021లో ప్రారంభించారు.

288.47 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డబ్యూ క్యూ 7 ,8 బెర్తులను పిపిపి విధానంలో యంత్రీకరించే

పనులను ఏప్రిల్ 2022లో ప్రారంభించేందుకు సన్నాహాలు.

2021-2022 ఆర్ధిక సంవత్సరంలో పూర్తి కానున్న ప్రాజెక్టులు

28. 40 కోట్ల రూపాయలతో రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన ఆర్ అండ్ డి యార్డ్ ఆధునీకీకరణ పనులు ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం.

4.39 కోట్ల రూపాయలతో అవుటర్ హార్బర్ లో ఎల్ పిజి బెర్త్

మరమ్మత్తులు మరియు పునర్నిర్మాణ పనులు ఫిబ్రవరి 2022 నాటికి పూర్తి.

633.11 కోట్ల రూపాయలతో చేపట్టిన కంటైనర్ టెర్మినల్ విస్తరణ కార్యక్రమం ఫిబ్రవరి 2022 నాటికి పూర్తి.

4.93 కోట్ల రూపాయలతో ఓఆర్ 1, ఓఆర్ 2 బెర్త్ లలో ఓఐఎస్ డి 156 నిబంధనల ప్రకారం 50 వేల నుంచి 1లక్ష డెడ్ వెయిట్ టన్నేజ్ వెస్సెల్స్ కు అవసరమైన మేరకు అగ్నిమాపక

వ్యవస్ధను ఆధునీకరించే పనులు నవంబర్ 2021 నాటికి పూర్తి.

పర్యావరణ పరిరక్షణ పనుల కోసం విశాఖపట్నం పోర్టు చేపడుతున్న చర్యలు

స్టాక్ యార్డుల చుట్టూ గ్రీన్ బెల్ట్ లను అభివృద్ది పరిచడం 

పోర్టు గత రెండు దశాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ పోర్టు పరిసర ప్రాంతాల్లో

పచ్చ దనాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.

1990 నుంచి పోర్టు పరిసర ప్రాంతాలతో పాటు, నివాస ప్రాంతాలవద్ద ,  నగర పరిధిలో సుమారు 630 ఎకరాల్లో 4,30,000 మొక్కలను నాటారు.

హుద్ హుద్ లో నష్టపోయిన పచ్చదనాన్ని తిరిగి నెలకొల్పేందుకు విశాఖ పోర్టు 5.65 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం సూచించింది.

ఇందులో సుమారు 4.625 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని పోర్టు పూర్తి చేసింది. 3.84 కోట్ల రూపాయలతో  మిగిలిన 1.02 లక్షల మొక్కల్లో 70 వేల మొక్కలను నాటే కార్యక్రమం పూర్తి. మిగిలినవి 2022 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు ఈ ఆర్ధిక సంవత్సంలో పూర్తి చేసేందుకు చర్యలు

90 లక్షల రూపాయల వ్యయంతో స్టాక్ యార్డులు, సరుకు రవాణా సమయంలో

బెర్త్ ల వద్ద డస్ట్ ను లేవకుండా చేసేందుకు ట్రక్ లతో కూడిన రెండు ఫాగ్ కెనాన్ ల ఏర్పాటు. ఈ ఏడాది చివరి నాటికి ట్రాలీ తో కూడిన మరో రెండు ఫాగ్ కెనాన్ ల ఏర్పాటుకు చర్యలు

పోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో దుమ్ము ధూళి ఎగిరి జనావాసాలలో పడకుండా ఉండేందుకు 7.50 మీటర్ల ఎత్తైన గోడలను 1.70 కిలో మీటర్ల మేర నిర్మాణం. సీ

హార్స్ జంక్షన్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకూ నిర్మించిన ఈ ఎత్తైన గోడల నిర్మాణానికి 9.75 కోట్ల రూపాయలు వెచ్చించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam