DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ మొత్తం లో గంజాయి ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు 

విశాఖపట్నం, ఆగస్టు 3 , 2018 (DNS Online ): విశాఖపట్నం జిల్లా పరిధి లో సుమారు 407 కేసుల్లో పట్టుకున్న 42,183 కిలోల గంజాయిని పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. న్యాయస్థానం అనుమతితో

శుక్రవారం   డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యవం లో కొత్తకోట పోలీసు పరిధి, రావికమతం మండలం కళ్యాణపు లోవ కొండల్లో à°ˆ గంజాయిని ధ్వంసం చేసినట్టు విశాఖ జిలా పోలీసు

ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం రూరల్, గొలుగూడ, నాతవరం కోటవురట్ల, నర్సీపట్నం

టౌన్, అనకాపల్లి పరిధి లో చోడవరం, వి. మాడుగుల, ఏ. కోడూరు, కె. కోటపాడు, బుచ్చయ్యపేట, చీడికాడ, దేవరపల్లి, అనకాపల్లి స్టేషన్లలో పట్టుకున్న ఈ గంజాయిని దహనం చేసినట్టు

తెలిపారు. వీటి అంచనా కోట్ల రోపాయల్లో ఉంటుందని అంచనా. న్యాయస్థానం అనుమతి తో గంజాయిని దగ్ధం చెయ్యడం విశాఖ జిల్లాలో ఇది మూడవసారి. గతంలో మొదటి సారి

మారికావలసలోని డంపింగ్ యార్డ్ వద్ద 11 ,493 కేజీలు గంజాయి ని ఫిబ్రవరి 27 ,2018 à°¨  à°§à±à°µà°‚సం చేయగా, రెండవ మారు 7 , 637 కేజీలు కళ్యాణపు లోవ లో మార్చి 13 , 2018 à°¨ కాల్చివేశారన్నారు. 
డ్రగ్స్

డిస్పోజల్ కమిటీ చైర్మన్, విశాఖపట్నం రేంజి డి ఐ జి సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఏజన్సీ లోని గిరిజనులు అమాయకత్వంతో గంజాయి కేసుల్లో ఇరుక్కుంటున్నారని, అసలు

నేరస్థులు తప్పించుకుంటున్నారన్నారు. వారిపై దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, సి హెచ్ వివేకానంద, డిఎస్పీ, తదితరులు

పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam