DNS Media | Latest News, Breaking News And Update In Telugu

100 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకాలు అందించి రికార్డు దిశగా భారత్

*ప్రధాని నరెంద్ర మోడీ కి సర్వత్రా అభినందనల వెల్లువ*

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 21,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు అందుబాటులోకి తీసుకురాబడిన టీకా ప్రస్తుతం భారత్ దేశంలో  ఒక బిలియాన్ ( 100 కోట్లమంది) కి పైగా అందించగలిగారు. భారత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అయన అభినందనలు తెలిపారు. అయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల సెప్టెంబర్ 17 న దేశ వ్యాప్తంగా ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించి, ఆ ఒక్క రోజే 2 కోట్ల మందికి పైగా టీకా వాయించి ఒక రికార్డు నెలకొల్పిన విషయం

తెలిసిందే. 

ప్రస్తుతం ఒక బిలియాన్ కి పైగా టీకా వేయించడం ప్రపంచంలోనే ఒక రికార్డుగా నమోదు అయ్యింది. ఈ వివరాలను కోవిడ్ కోసం ఏర్పాటు చేసిన వెబ్సైటు ద్వారా తెలియచేయబడింది. ఈ టీకా లను కేంద్రప్రభుత్వం పూర్తిగా ఉచితంగానే దేశ ప్రజలకు అందిస్తోంది. ఇతర దేశాలకు సైతం టీకాలను అందించి, నరేంద్ర మోడీ తన ఔదార్యాన్ని

చాటుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam