DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ అనే సైతాన్ ని అధికారం నుంచి  పారద్రోలాలి... : ఎస్ ఏ రెహమాన్ 

విశాఖపట్నం, ఆగస్టు 4 , 2018 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ రాష్ష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ అనే సైతాన్ ని అధికారం నుంచి పారద్రోలాలని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ

ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ రెహమాన్ పిలుపునిచ్చారు. శనివారం నగరం లోని తెలుగుదేశం పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ నెల 28 వ

తేదీన గుంటూరు లోని, బ్రహ్మానంద రెడ్డి మైదానం లో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యవం లో ముస్లిం బహిరంగ సభ

జరుగుతోందని, ఈ సభలో ముస్లిం మైనారిటీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు పలు తీర్మానాలు ఈ సభలో జరుగుతాయన్నారు. మైనారిటీలను తక్కువచేసి

చూడవలసిన అవసరం లేదని. స్వాతంత్ర పోరాటం లో మతాలకు అతీతంగా పాల్గొని, అందరూ కలిసి పాల్గొని సమైక్యతను చాటిన దేశం భారత దేశం అన్నారు. భారత జాతి అనేది ఏ ఒక్క మతానికో

చెందినది కాదని, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, జైనులు, పారశీలు, సిక్కులు ఇలా అన్ని సామాజిక వర్గాల సమాహారమేనన్నారు. ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ కావాలంటే

చంద్రబాబు ని మళ్ళీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రోజంతా కష్టపడి పనిచేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి పదం లో

తీసుకువెళ్తున్న ఈయనకు ప్రజలంతా అండగా నిలబడి రానున్న ఎన్నికల్లో సంపూర్ణ అధికారాన్ని మరోసారి కట్టబెడితే ప్రస్తుతం జరుగుతున్నా ప్రోజక్టులు పరిపూర్ణంగా

నెరవేరతాయన్నారు. 


ఆంధ్రా గురించి మాట్లాడే హక్కు జివిఎల్ కు లేదు : 

బీజేపీ ఎంపీ జివిఎల్ నర్శింహారావు లార్వా దశలోనే ఉన్నారు, అతనికి ఇంకా పరిపక్వత

లేదు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులను చేయడం తగదన్నారు. నర్సింహారావు గతంలో గుంటూరు లో ఉన్నప్పడు నుంచి

పరిచయం ఉందని, నాడు యజ్ఞ నారాయణ రావు కార్యాలయం లో ఉండేవారని,  à°—ుంటూరు లో మాయమై, ఢిల్లీలో తేలాడన్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీ à°—à°¾ ఎన్నికైన ఇతను ఆంధ్ర ప్రదేశ్

గురించి మాట్లాడే హక్కు గానీ, అర్హత లేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే ఆరోగ్యం పాడవుతుంది హెచ్చరించారు. 

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నగర అధ్యక్షులు,

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ముస్లిం  à°¨à±‡à°¤à°²à±  à°°à°«à±€, నర్గిస్ తదితరులు పాల్గొన్నారు. 

 

#DnsLive #TDP #Rehman #dns live #dnsnews #dns news #dns #dns media #telugudesam #muslim 3TDP Rehman #telugudesam party #guntur

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam