DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యవం లో భగవద్రామానుజుల పై అంతర్జాతీయ సదస్సు

సర్వ మానవాళి మార్గదర్శి భగవద్రామానుజులే : చిన్న జీయర్ స్వామి

శంషాబాద్, ఆగస్టు 4 , 2018 (DNS Online ) : విశిష్టాద్వైత సంప్రదాయాన్ని స్థాపించిన భగవద్రామానుజుల జీవన శైలి పై

అంతర్జాతీయ సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.  à°¨à°¾à°²à±à°—ు రోజుల పాటు హైదరాబాద్ లోని చిన్నజీయర్ ఆశ్రమం శంషాబాద్ ( జీవా )లో లోని జిమ్స్ హోమియో వైద్య కళాశాలలో

నిర్వహిస్తున్న à°ˆ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.  
జీయర్ ఎడ్యుకేషనల్ సంస్థ ( JET ) ఆధ్వర్యవం లో జరిగిన ప్రారంభోత్సవ సమావేశం లో పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి

శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి à°ˆ సదస్సును మంగళాశాసన పూర్వక ప్రసంగం తో  à°ªà±à°°à°¾à°°à°‚భించారు.  à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళికి మార్గదర్శకం చేసిన

మహనీయులు భగవద్రామానుచార్యులేనని, ఆయన ఈ భూమిపై ఆవిర్భవించి వెయ్యి సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా

జరుగుతున్నాయన్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని 216 అడుగుల భగవద్రామానుజుల సమతా మూర్తిని రూపకల్పన చేసి, ఆయన ఈ ప్రపంచానికి అందించిన విశిష్టాద్వైత

సంప్రదాయాన్ని ప్రజలందరికీ అందాలనే సంకల్పంతో గ్రామ గ్రామాల వికాస తరంగిణి సేవ సంస్థలను నెలకొల్పి పలు సేవాకార్యక్రమాల్లో ప్రజలను కూడా భాగస్వాముల్ని చేయడం

జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలోనూ అందరికీ ఆలయ ప్రవేశం కల్పించిన మొట్ట మొదటి వారు రామానుజులేనని,స్వామి అనుగ్రహం అందరికీ లభించాలి అనే ఏకైక ఆశయం తోనే

గోష్టీపురం లోni ఆలయ గోపురం ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ ఉపదేశం చేసి తన ఆచార్యులు ఆగ్రహానికి కూడా గురయ్యారు. అయితే తన గురువు కు రామానుజులు ఇచ్చిన

సమాధానం తాను ఒక్కడే నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ ప్రజలంతా పరమపదానికి చేరుకుంటారు కదా అదే మహాభాగ్యం అన్న ఆయన సమాధానంతో ఆయన ఆగ్రహం చల్లారి ఉదయవర్లు అనే

బిరుదు ఇచ్చి సత్కరించారన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సు లో త్రిదండి అహోబిల జీయర్ స్వామి, త్రిదండి దేవనాధా జీయర్ స్వామి

తదితరులు పాల్గొన్నారు. 
à°ˆ సదస్సు ఆగస్టు  3 ,2018 నుంచి 6 వరకూ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 

మొదటి రోజు కార్యక్రమం లో . . . . ఆగస్టు 3 న జరిగిన

ప్రధమ చర్చ గోష్ఠి లో  
సంస్థ సంచాలకులు డాక్టర్ ఎస్ వి రంగరామానుజాచార్యులు స్వాగతం పలుకగా, జె ఆర్ ఆర్ సంస్కృత విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ కె వి

రామకృష్ణమాచార్యులు, డాక్టర్ ఎం ఏ లక్ష్మి తాతాచార్ ( మేల్కొటై), డాక్టర్ కె ఈ దేవనాధన్ ( తిరుపతి వెంకటేశ్వర వేదం విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి), హార్వర్డ్ విశ్వ

విద్యాలయం కు చెందిన డాక్టర్ ఫ్రాన్సిస్ క్లూనీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సదస్సులో భగవద్రామానుజాచాయుల పై పైభావం చూపిన యామునాచార్యుల సంస్కరణలు,

కార్యాచరణ అనే అంశం తో ప్రత్యేక అంశాల చర్చ మొదలైంది. దీనికి డాక్టర్ లక్ష్మి తాతాచార్ అధ్యక్షత వహించగా, ఎస్ వి సుదర్శనాచార్య , డాక్టర్ ఎం ఏ వెంకట కృష్ణన్ లు

పాల్గొనగా, రామానుజ సిద్ధాంతం లో అవిద్య పై అనే అంశం పై జరిగిన రెండవ చర్చ లో డాక్టర్ కె à°ˆ దేవనాధన్ అధ్యక్షత వహించగా à°Žà°‚ ఏ ఆళ్వార్,  à°µà±‡à°²à±à°•à±à°•à±à°¡à°¿ రంగనాధన్, à°Žà°‚ ఏ

మధుసూదన్ లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన శాస్త్ర చర్చ లో à°Žà°‚ ఏ ఆళ్వార్ అధ్యక్షత వహించగా భరతన్, ఉమేష్ పురుషోత్తమం లు పాల్గొన్నారు. 

రెండవ రోజు సదస్సులో భాగంగా

 à°†à°—స్టు 3 à°¨ జరిగిన చర్చ గోష్ఠి లో. . .   బ్రహ్మ సూత్రాలకు భాష్యం ద్రావిడ భాషలో వ్యాఖ్యానం వ్రాయడానికి రామానుజాలను ఆకర్షించిన పరిస్థితులు, శ్రీ భాష్యం పై

వ్యాఖ్యానం, విజ్ఞానేశ్వరునిపై రామానుజుల ప్రభావం, భగవద్రామానుజులు తెలియచేసిన పరమాత్మా, జీవాత్మ సంబంధం, రామానుజ సిదాంతం పై వివిధ వ్యాఖ్యానాలు, వేదాంత సంగ్రహం

పై సిద్దిత్రయ ప్రభావం, వేద సారం ప్రకారం నారాయణుడే సర్వేశ్వరుడు, రామాయం పై ప్రభాకర మీమాంశ ప్రభావం, రామానుజ శరీర లక్షణాలు అనే అంశాలపై అత్యద్భుతం గా చర్చా

గోష్ఠి సాగింది. 

మూడవ రోజు కార్యక్రమం లో భాగం à°—à°¾  à°†à°—స్టు 5 à°¨ జరిగే చర్చ గోష్ఠి లో . . . . ప్రతి రోజు పెరుమాళ్ళను ఆరాధించే విధానాలను వివరించిన రామానుజ నిత్యా

గ్రంధం,  à°°à°¾à°®à°¾à°¨à±à°œà±à°² ప్రకారం శబ్ద ప్రమాణం, రామానుజ సిద్ధాంతం ప్రకారం లీలా విభూతి అయిన పరమాత్ముని à°ˆ ప్రపంచంలో  à°¨à°¿à°µà°¾à°¸ ప్రదేశం, గీతా చర్మ శ్లోకం పై చర్చ

జరుగనున్నాయి. 

ఆఖరి రోజు కార్యక్రమం లో భాగం à°—à°¾  à°†à°—స్టు 6 à°¨ జరిగే చర్చ గోష్ఠి లో . . . . వేద అపౌరుషేయ,  à°µà±‡à°¦ ప్రమాణం పై  à°šà°°à±à°š,  à°ªà°°à°¾à°¯à°¤à±à°¤à°¾à°¦à°¿à°•à°°à°£à°‚ అనే అంశం పై కందాడై

రామానుజాచార్యులు ప్రసంగం అనంతరం సదస్సు ముగింపు కార్యక్రమం లో చిన్న జీయర్ స్వామి మంగళశాసన ప్రవచనం చేయనున్నారు. 

రామానుజుల సహస్రాబ్ది ఉత్సవ వేడుకల్లో

భాగంగా జరుగుతున్న నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు మరో రెండు రోజులు సాగే ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పరిశోధకులు, పండితులు,

విద్యార్థులు రామానుజుల సిద్ధాంతం పై పలు పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. 
 


#dns #dnslive #dns live #dnsmedia #dns media #dnsnews #dns news #JET #Jeeyar Educational Trust #Chinna Jeeyar #CJ #Jeeyar swamy #jeeyarswami #vikasa tarangini #international conference #Ramanuja #bhagavadraamanuja #Ramanujacharya #dravida 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam