DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ 30 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

*శ్రీకాకుళం, అక్టోబర్ 26,  2021 (డిఎన్ఎస్):* తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిరుల‌త‌ల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు న‌వంబ‌రు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో వాహన మండపంలో

ఏకాంతంగా జరుగనున్నాయి. 

ఇందుకోసం న‌వంబరు 29వ తేదీ ఉద‌యం ల‌క్ష‌కుంకుమార్చ‌న, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. 

ఈ వేడుకల్లో జరుగునున్న వాహనసేవల వివరాలు :

న‌వంబ‌రు 30 వ  తేదీ ఉదయం ధ్వజారోహణం

జరుగుతుంది. అదేరోజు రాత్రి  చిన్నశేషవాహనం

డిసెంబర్ 01 వ  తేదీ ఉదయం పెద్దశేషవాహనం, అదేరోజు రాత్రి హంసవాహనం

డిసెంబర్ 02 వ  తేదీ ఉదయం ముత్యపుపందిరి వాహనం, అదేరోజు రాత్రి సింహవాహనం

డిసెంబర్ 03 వ  తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, అదేరోజు రాత్రి హనుమంతవాహనం

డిసెంబర్ 04 వ  తేదీ ఉదయం

పల్లకీ ఉత్సవం - వ‌సంతోత్స‌వం, అదేరోజు రాత్రి గజవాహనం

డిసెంబర్ 05 వ  తేదీ ఉదయం స‌ర్వ‌భూపాల వాహ‌నం - సాయంత్రం స్వర్ణరథం బ‌దులు సర్వభూపాలవాహనం, రాత్రి - గరుడవాహనం

డిసెంబర్ 06 వ  తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, అదేరోజు రాత్రి  చంద్రప్రభ వాహనం

డిసెంబర్ 07 వ  తేదీ ఉదయం రథోత్సవం బ‌దులు

స‌ర్వ‌భూపాల వాహ‌నం, అదేరోజు రాత్రి  అశ్వ వాహనం

డిసెంబర్ 08 వ  తేదీ ఉదయం పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)  అనంతరం ధ్వజావరోహణం జరుగుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam