DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ మంత్రిమండలిలో పలు కీలకల నిర్ణయాలకు ఆమోదం 

*విశాఖలో అదానీ కి 130 ఎకరాలు, శారదాపీఠానికి 15 ఎకరాలు* 

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, అక్టోబర్ 28,  2021 (డిఎన్ఎస్):* అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు విశాఖ మధురవాడ ప్రాంతంలో  130 ఎకరాలు, విశాఖ శ్రీ శారదా పీఠానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో 15 ఎకరాలు ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి  మండలి

ఆమోదం తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చేనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.  ప్రధాన అంశాలు.  .

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే అమ్మెందుకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ

ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. 

దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. 

అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై

విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేకశాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. 

వచ్చేనెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో

ప్రాథమికంగా నిర్ణయించారు.

రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం 

యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేబినెట్ 

2021 జనాభా గణనలో బీసీ జనాభాను

కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం 

అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం 

కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం 

వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్

ఆమోదం 

రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం 

పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్ 

జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం

జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam