DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 31 న పవన్ సభ 

*(DNS Report : Ganesh. BVS, Staff Reporter, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 29,  2021 (డిఎన్ఎస్):* విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ తో ఉక్కు పరిరక్షణ సమితి చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ ఈ నెల 31 న జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ కు వచ్చి, ప్రత్యక్షంగా పాల్గొనున్నట్టు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి టి.

శివ శంకర్ తెలిపారు. శుక్రవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు జరుగుతున్న ఈ పోరాటానికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభ  31వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గాజువాక కూర్మన్నపాలెం జంక్షన్ బహిరంగ సభ లో పవన్

సూచనలు చేస్తారని తెలియజేశారు. 

ఉద్యమంలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ప్రత్యక్షంగా ఉంటె తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే సంకల్పంతో ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు, నిర్వాసితులు ఆయనను ఆహ్వానించడం జరిగిందన్నారు. 

పార్టీ ప్రధాన నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సభ పూర్తిగా పవన్ కళ్యాణ్

వ్యక్తిగతమని, పార్టీ భాగస్వామ్యం ఉండదన్నారు. గాజువాక కూడలి నుంచి దీక్ష వేదిక వరకు పార్టీ జండాగానీ, స్వాగత బ్యానర్లు కానీ ఉండవని తెలిపారు. ఈ ఉద్యమం అన్ని పార్టీల కలయికతోనే జరగాలి అనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

విశాఖ విమానాశ్రయం నుంచి గాజువాక కూడలి వరకు మాత్రమే జనసేన పార్టీ జండాలు, స్వాగత

బ్యానర్లు ఉంటాయని తెలిపారు. తదుపరి దీక్ష శిబిరం వరకూ ఎటువంటి జండా ఉండదన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తొలినాళ్లలోనే పవన్ కళ్యాణ్ స్పందించి, ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద  అభ్యంతరం చేయడం జరిగిందన్నారు. 

పవన్ కళ్యాణ్ హాజరవుతున్న ఈ సభ సామాజిక అంశమని, దీనిని రాజకీయం

చేయకుండా తెలుగుజాతి ఆత్మగౌరవానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ధ్యేయంగా చూడాలన్నారు. 

ఈ సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు 500 మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం అందించామన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాకపై ఏర్పాట్లుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. 

సమావేశంలో

పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, జనసేన పార్టీ, జివిఎంసి  నాయకులు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, వన్నెం రెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam