DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఋణ మేళాతో ఖాతాదారులకు ఎంతగానో లబ్ది: కలెక్టర్

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 29,  2021 (డిఎన్ఎస్):* స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సారథ్యంలో విశాఖ నగరంలో జరిగిన ఋణ వితరణ కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన జిల్లా  కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున  మాట్లాడుతూ ఋణ వితరణ మహోత్సవం ఖాతాదారులకు ఎంతగానో లబ్ది

చేకూరుస్తుoదని అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ నెల 12 నుండి ప్రారంభమైన ఋణ వితరణ మహోత్సవం విజయవంతంగా కొనసాగుతుండడం అభినందనీయమని అన్నారు.  అన్ని బ్యాంకుల సేవలు ఒకే చోట అందించడం ఋణాలు, సంక్షేమ పధకాలు పొందదలచిన వారి సందేహాలను ఈ మహోత్సవం నివృత్తిని చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక పధకాలు బ్యాంకులతో

సత్సంబంధం కలిగి ఉన్నాయని కొన్ని పధకాలను ఉదాహరించారు.  

         రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జగనన్న హౌసింగ్ కార్యక్రమానికి, వ్యవసాయ శాఖ, హర్టికల్చర్, పరిశ్రమల శాఖ,  డి ఆర్ డి ఎ., తదితర ప్రభుత్వ శాఖలు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. 
బ్యాంకులు  ప్రభుత్వ శాఖలకు నిరంతరము

 సహకారము అందించాలని కోరారు. 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ది, సంక్షేమ పథకాలను ఎంతో మంది లబ్దిదారులు ఉపయో కుంటున్నారు.  ఏజెన్సీ,, గ్రామీణ ప్రాంతాలు, చిన్న చిన్న హ్యబిటేషన్ల లో బ్యాంకుల సేవలు ఇంకా పెరగాలన్నారు.   ఋణాలు తీసుకున్న వారు విధిగా నెల వాయిదాలు చెల్లించాలని, అప్పుడే అభివృద్ధి

సాధ్యమవుతుందని  రుణ గ్రహీతలకు సూచించారు. అప్పుడే బ్యాంకుల మనుగడ వృద్ధి దిశలో పయనించడం సాధ్యమవుతుందని అన్నారు.  ఏ కార్యక్రమానికి  రుణాలను   తీసుకున్నారో    ఖచ్చితముగా  దానికే ఖర్చు చేసి అభివృద్ధి చెందాలన్నారు.

అనంతరం వివిధ బ్యాంకుల స్టాల్స్ ని సందర్శించారు, తదుపరి మంజూరైన ఋణాల చెక్కులను ఆయా

శాఖల అధికారులకు జిల్లా  కలెక్టర్  అందించారు.  ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam