DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పర్యాటకం పేరుతో విశాఖ భూములు ధారాదత్తమా?: సిపిఎం 

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, అక్టోబర్ 29,  2021 (డిఎన్ఎస్):* పర్యాటకం పేరుతో అత్యంత ఖరీదైన  భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం దారుణమని  సిపిఎం గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి డా. బి గంగారావు మండిపడ్డారు. దీనిపై ఒక పత్రికా సమాచారాన్ని విడుదల

చేసారు. 

ప్రైవేటు సంస్థలు విశాఖలో ఏడు నక్షత్రాల హోటళ్లు నిర్మించేందుకు మంత్రి మండలి గురువారం ఆమోదం తెలిసింది. రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాలు  భూ దోపిడీని ప్రోత్సహించేవిగా ఉన్నాయన్నారు. ఇందుకు కోట్ల రూపాయల విలువైన భూములను పెద్ద మొత్తంలో కేటాయించారు. మధురవాడ శిల్పారామం జాతరలో ఓ స్టార్‌ హోటల్‌,

కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రభుత్వం, ప్రయివేటు భాగస్వామ్య విధానం (పిపిపి)లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇలా పర్యాటకం పేరుతో ప్రభుత్వ భూములను, ఆస్తులను ప్రయివేటు వారికి అప్పగించడం, ప్రజలకు ఆహ్లాదం చేకూర్చే ప్రదేశాలను ప్రయివేటు నిర్వహణకు ఇవ్వడం వంటి చర్యలను సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ

ఖండిస్తోంది. ప్రయివేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులను చేయవని గుర్తు చేసిందన్నారు.
గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో విశాఖ కేంద్రంగా తీసుకున్న పలు నిర్ణయాలు ప్రైవేటువారికి మేలు చేసేవిగా ఉన్నాయని, భీమిలి మండలం అన్నవరం గ్రామంలో 40 ఎకరాలను ఒబెరాయ్‌ సంస్థకు

కేటాయించారు. రూ. 350 కోట్లతో రిసార్టుతో పాటు 300 వ్యక్తిగత విల్లాలు నిర్మిస్తామని, వేడుకల నిర్వహణకు ప్రాంగణాలు, కాఫీ షాపులు, బార్లు, ఈత కొలనులు, వ్యాయామ శాల, పార్కింగ్‌ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. 
అలాగే తాజ్‌ బ్రాండ్‌తో విశాఖలో 260 గదులతో అయిదు నక్షత్రాల హోటల్‌ నిర్మించి 1270 చదరపు అడుగుల్లో 90

సర్వీసు అపార్టుమెంట్లును అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. 
దీంతో పాటు 2500 మంది కూర్చునేందుకు వీలుగా తాజ్‌ బ్రాండ్‌తో రూ.722 కోట్లతో ఐటి సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 
కైలాసగిరి కొండపై భారీ స్కై టవర్‌ను పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 
అలాగే మధురవాడ

శిల్పారామం జాతరలో ప్రయివేటు హయత్‌ సంస్థ ఆధ్వర్యాన ఓ స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని కూడా పిపిపి పద్ధతిలోనే ఏర్పాటు చేయనున్నారు. 
200 గదులతో పాటు ఒకేసారి 1500 మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. 
మూడు ఎకరాల్లో రూ.200 కోట్ల

పెట్టుబడితో ఈ పనులు చేయనున్నారు. ఇక్కడ అందుబాటులో 25 ఎకరాల స్థలం ఉన్నా పిపిపి విధానం కావడంతో ప్రస్తుతమున్న శిల్పారామాన్ని కొనసాగిస్తారా ? లేదా ? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. టూరిజం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలన్నీ ప్రయివేటుకు లాభం చేకూర్చేవే. 
గతంలో గంగవరం పోర్టును పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేసి

తదనంతరం అదానీ సంస్థకు ఎలా కట్టబెట్టారో అందరికీ తెలుసు. మొదట్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం అని చెబుతున్నా అంతిమంగా ప్రయివేటుకు దోచిపెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ చర్యలను సిపిఎం ఖండిస్తోంది.

శారదా పీఠానికి స్థల కేటాయింపు సరికాదు

చినముషిడివాడలోని శారదా పీఠానికి భీమిలి మండలం

కొత్తవలసలో ప్రభుత్వం 15 ఎకరాల స్థలం కేటాయించిందిని, పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్థలాన్ని కోరిన తరువాత అతి తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. బహిరంగ మార్కెట్లో ఎకరా స్థలం రూ. 5 కోట్లు వరకూ పలుకుతున్నా శారదా పీఠానికి 1.50 కోట్లుకే ధర నిర్ణయించి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మత క్రతువులకు

కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను అప్పగించడం సరికాదు. ఈ నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకిస్తోంది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయాలు ఉండాలని కోరుతోంది. తక్షణమే ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు భూములను అప్పగించే చర్యలను మానుకోవాలని డిమాండ్‌ చేస్తోందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam