DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విధ్వంసకర బైక్ రైడర్ల పై కఠిన చర్యలు తప్పవు : నగర పోలీస్ 

విశాఖపట్నం, ఆగస్టు 5 , 2018 (DNS Online ): విశాఖపట్నం నగర పరిధిలో విధ్వంసకారం గా ద్విచక్రవాహనాలను నడుతుపున్న వాహనదారులను, నగర పోలీసులు అరెస్ట్ చేయగా, సుమారు 100 స్పోర్ట్స్

బైక్ లను సీజ్ చేశారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ అర్ధరాత్రి నిర్వహించిన ప్రత్యేక రైడ్ ల్లో à°ˆ వాహనాలకు సైలన్సర్లు తీసి వేసి భారీ శబ్దం తో నడుపుతున్న వారిని, అష్టావక్రముగా

నడుపుతూ ప్రజలను భయభ్రాంతులను చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 1 వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో ఎవరైనా ద్విచక్ర వాహనాలను అతి వేగంగా నడపడం గానీ,

ఇతరులకు ఇబ్బంది కల్గించేలా భయభ్రాంతులయ్యేలా అష్టావక్రముగా నడపడం గానీ, సైలన్సర్లు తీసి వేసి భారీ శబ్దం తో నడుపడం , వాహనాలపై విన్యాసాలు చెయ్యడం గానీ,

జిగిజాగ్ లా నడపడం, మద్యం సేవించి డ్రైవ్ చెయ్యడం, మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ నడపడం గానీ, à°°à°¾à°¤à±à°°à°¿ వేళల్లో బైక్ రేస్ లు నిర్వహించడం, చిత్ర విచిత్ర హార్న్ తో ప్రజలను

భయభ్రాంతుల్ని చెయ్యడం వంటివి పూర్తి గా నిషేధం గా తెలిపారు నగర పోలీసు విభాగం. వీటన్నింటిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు

తెలియచేస్తున్నారు. ఇటీవల కాలం యువతలో పెరిగిన పైత్య ప్రకోపం వలన పైన తెలిపిన విధంగా పలువురు  à°¯à±à°µà°•à±à°²à± ప్రజలు భయభ్రాంతులయ్యేలా నడుపుతున్నారని, బైక్ పై యువతులను

ఎక్కించుకుని మరీ ఈ విపరీత పైత్యాలు చేస్తున్నట్టు నగర పోలీసు విభాగానికి వచ్చే ఫిర్యాదుల సంఖ్యా భారీగానే ఉండడంతో శనివారం రాత్రి పోలీసు అధికారులు ప్రత్యేక

డ్రై చేపట్టారు. ఈ రైడ్ లో సుమారు 100 బైక్ లను సీజ్ చెయ్యగా, అత్యుత్సాహం లో ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల్లో బైక్ లు నడుపుతూ ఆరెస్ట్ కాబడ్డ

వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వీరితో వాహన యజమానులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. వీరికి, వీరి తల్లిదండ్రులకూ ఆదివారం పోలీసు అధికారులు

ప్రత్యేక కౌన్సలింగ్ చేపట్టారు.


#dns #dnsnews #dns news #dnsmedia #dns media #dnslive #dns live #vizag #visakhapatnam #police #police commissioner #bike riding #bike race #bike chage #arest #counselling
           

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam