DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వాతంత్య్ర  సమరయోధుల నుంచి స్ఫూర్తి పొందాలి - ఉపరాష్ట్రపతి

 

*విశాఖపట్నం, నవంబర్ 05,  2021 (డిఎన్ఎస్):* స్వాతంత్ర్య ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఆ మహనీయుల కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని

తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. 
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్  కన్వెన్షన్ సెంటర్ లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. 1885 – 1945 మధ్య

కాలానికి చెందిన ఉమర్ అలీషా గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులన్న ఉపరాష్ట్రపతి, మహా పండితుడు, మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త  అలీషా అంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా వారు సేవలందించారని తెలిపారు. స్వరాజ్యం కోసం తమ వాణిని చట్టసభల్లో బలంగా వినిపించిన అలీషా చట్టసభల ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం

అభినందనీయమని తెలిపారు.

స్వరాజ్యం సముపార్జించుకుని 75 సంవత్సరాల మైలురాయిని అధిగమిస్తున్న తరుణంలో,  కేంద్ర ప్రభుత్వం “ఆజాదీకా అమృత్ మహోత్సవ్” పేరిట గొప్ప ఉత్సవాలను సకల్పించడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ఈ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని ముందు

తరాలకు అందించడమేనని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, ఆచార్య ఎన్జీ రంగా, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి మహనీయులతో పాటు ఎందరో మహిళామణులు ఉద్యమంలో పాల్గొన్నారన్న ఉపరాష్ట్రపతి విశాఖ జిల్లా నుంచి స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్న వీరనారీమణుల పేర్లను

ప్రస్తావించారు. విస్మరించజాలని స్వాతంత్ర్య సమరయోధులు చరిత్రలో ఎందరో ఉన్నారని, వారి జీవితాలను యువతకు తెలియజేసేందుకు ఫేస్ బుక్ వేదికగా మనోగతం పేరిట వారి గురించి  యువతకు తెలియజేసే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్, తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam