DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 న కనకమహాలక్ష్మీ ఆలయంలో మార్గశిర మాసోత్సవ రాట

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 13,  2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు, 
విశాఖ నగరంలోని బురుజు పేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక మార్గశిర మాసోత్సవాల రాట మహోత్సవం ఈ నెల 15 న జరుగనున్నట్టు ఆలయ ఈఓ ఎస్ జె మాధవి తెలియచేసారు. ఆంధ్రుల ఆరాధ్యదైవం, సౌభాగ్య ప్రదాయిని గా కొలువైన

అమ్మవారి దేవస్థానంలో డిసెంబర్ 5, 2021 నుంచి జనవరి  2, 2022 వరకూ మార్గశిరమాస ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ వేడుకల ప్రారంభ 
ఉత్సవమునకు శుభారంభ సూచికగా " రాట మూహూర్తం " నవంబర్ 15 న సోమవారం ఉదయం గం. 8.15 నిమిషాలకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ రాట

మార్గశిరమాసోత్సవములతో ఉత్సవాలకు శ్రీకారం పలకడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. ఆ సంప్రదాయం ప్రకారం సోమవారం నాదస్వర సుస్వరాలతో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 
ఈ వేడుకలు,  శ్రీ అమ్మవారి సేవలు, దర్శనములు ప్రభుత్వం వారు సూచించిన కోవిడ్ - 19
నియమ నిబంధనల ప్రకారం

జరుగుతున్నాయన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam