DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అడ్వాన్స్ లేనిదే ఏపీకి ఉత్పత్తులు ఇవ్వొద్దు: ఏఐఎంఈడి

*జాతీయ మెడికల్ డివైస్ సంఘం సభ్యులకు రెడ్ నోటీసు*  

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, నవంబర్ 13,  2021 (డిఎన్ఎస్):* ఇప్పడికే ఆర్థిక భారంతో ఇబ్బందుల్లో కూరుకు పోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అసోసియేషన్ అఫ్ ఇండియన్ మెడికల్  డెవిస్స్ ఇండస్ట్రీ సంఘం మరో గట్టి షాక్ ఇచ్చింది. గత 4, 5 ఏళ్లుగా

ఏపీ నుంచి 10 వేల  కోట్ల రూపాయలు నిధులు వివిధ సంస్థలకు బకాయిలు రానందున, ఇకపై ముందస్తుగా 100 శాతం నగదు చెల్లించనిదే ఎటువంటి ఉత్పత్తులు ఏపీకి విడుదల చెయ్యవద్దని, తమ సంఘం సభ్యులకు రెడ్ నోటీసు విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లోను, తమ website  లోనూ ఈ నోటీసు ను ప్రచురించింది.    

వైద్య పరికరాలు సరఫరా చేసే

కంపెనీలు..ఏపీతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.  ఏపీ ఆరోగ్య శాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయొద్దు.                     

ఈ నోటీసు తరువాత కూడా ఎవరైనా అడ్వాన్స్ లేకుండా లావాదేవీలు జరిపినట్లయితే. . .ఆ రిస్క్ ను తామే భరించాలని ప్రకటించింది. 

దేశంలో వైద్య పరికరాలు ఉత్పత్తి చేసే ప్రతి

కంపెనీ ఈ యూనియన్ లో ఉంటుంది. దాదాపు 500 కంపెనీలకు యూనియన్ మెంబర్ షిప్ ఉన్నట్లు చెబుతున్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవటం.. చెల్లింపులు జరగకపోవటంతో ఇప్పుడీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10వేల కోట్లు అప్పు పడింది. బిల్లులు చెల్లించకపోతే పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు రోడ్డెక్కిన విషయం తెల్సిందే. ప్రభుత్వ

టెండర్లలో పాల్గొనబోమని చెప్పిన విషయం గమనార్హం. 

ఏపీసర్కారుకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవటంపై పలు కంపెనీలు జాతీయ అసోసియేషన్ కు కంప్లైంట్ చేశాయి. దీనికి స్పందనగా సంఘం ఈ రెడ్ నోటీ ను జారీచేసినట్టు తెలుస్తోంది. ఏమైనా బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ఏపీ సర్కారు ఇమేజ్ రోడ్డు మీద పడిన

దుస్థితి. దీనికి ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

మొన్న కేంద్రం ఏపీ జెన్ కో కు నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చటం తెలిసిందే.    

ఏపీ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన వైనం మీద జారీ చేసిన ఈ రెడ్ నోటీసులు ఏపీ సర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా మారిందన్న అభిప్రాయం బలంగా

వినిపిస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam