DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల వరాహస్వామి గుడి వద్ద భారీగా నిలిచిన వర్షం నీరు

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 18,  2021 (డిఎన్ఎస్):* భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తిరుమల మాడ వీధులలో వరాహ స్వామి గుడి లోకి సైతం వర్షం నీరు చేరుకుంది. గంగమ్మ ఉగ్రరూపం ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఇలా చూడలేదని, తిరుమల మాడ వీధులలో ఈ విధంగా వర్షం నీరు చేరడం చూడలేదని స్థానికులు తెలియచేస్తున్నారు. 
/> భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేయడం జరిగిందని టిటిడి ప్రకటించింది. ఘాట్ రోడ్లు తెరిచే సమయాన్ని తిరిగి తెలియజేయడం జరుగుతుందని తెలిపింది.  తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసి వేయడం జరిగింది. ఈ రెండు నడకమార్గాలు నవంబర్ 19వ తేదీ కూడా

మూసి ఉంచబడతాయి. 

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షం కారణంగా ముందస్తుగా టికెట్లు పొంది ఉన్న భక్తులు స్వామి దర్శనానికి రాలేకపోయినట్టయితే వారికీ  తరువాత రోజులలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి తెలియచేసారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam