DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగుజాతి ప్రతిష్టను వైసీపీ దిగజారుస్తోంది: బివి రామ్

*విశాఖపట్నం, నవంబర్ 20,  2021 (డిఎన్ఎస్):* ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకే అయితే.. వెంటనే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని విశాఖపట్నం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. నిజంగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు

చేస్తే  తిరుగులేని ఆధిక్యంతో గెలుపొంది మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని అన్నారు.

ఈ క్రమంలోనే తెలుగుజాతి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన తెలుగు తేజం నందమూరి తారకరామారావు కుమార్తె, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని అవమానపరిచే విధంగా మాట్లాడారని అన్నారు. ఒక మహిళ పట్ల

అవమానకరంగా  ఎవరు మాట్లాడినా అది ఎంతమాత్రం సహేతుకం  కాదన్నారు. అటువంటిది.. స్థాయిలో ఉన్న వ్యక్తులు  అవమానకర రీతిలో మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రపంచ స్థాయిలో కీర్తిని ఆర్జించిన చంద్రబాబు నాయుడును  ముఖ్యమంత్రి జగన్

మోహన్ రెడ్డి తో పాటు అతని అనుచరులు అనేకమార్లు హేళన చేశారని  ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రపంచలో ఉన్నత పదవుల్లో ఉన్న ఏ వ్యక్తి బెయిల్ పైన లేరు... ఆ గౌరవం మన రాష్ట్రానికి దక్కింది తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు.

మరోవైపు సక్రమంగా ఒకటో తారీఖు నాటికి జీతాలు అందుతాయో అందవో అని ప్రభుత్వ

ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే  ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. ఇందుకు నిదర్శనమే స్థానిక ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపుగా కనుమరుగయ్యాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలోనే ఇంత వ్యతిరేకత ఉంటే ఇక సామాన్య ప్రజలలో ఎంత వ్యతిరేకత  గూడుకట్టుకుందో

సులువుగా అర్థం చేసుకోవచ్చని రామ్ వ్యాఖ్యానించారు. అసలు అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితి బాగుంటే  సంక్షేమ పథకాలను అమలు చేసినా అభ్యంతరం లేదని.. కానీ రాష్ట్రంలో ఆస్తులను సైతం తనఖా పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేయడం సరికాదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam