DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోగి కోసమేనా నరేంద్ర మోడీ రైతు చట్టాలపై వెనక్కి తగ్గింది

*(DNS Report : Sairam. CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, నవంబర్ 20,  2021 (డిఎన్ఎస్):* గత ఆరు నెలలుగా భారత్ లో  32 రైతు సంఘాల ప్రతినిధులు ఇటీవల ప్రవేశ పెట్టిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని చేస్తున్న పోరాటం ఫలితం గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు దీన్ని

తమ విజయంగానే చెప్పుకుంటున్నాయి. కమ్యూనిస్టు సంఘాలు అయితే ఏకంగా మోడీ మెడలు వంచాము అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే దీని వెనుక వాస్తవాలు వేరే సందేశాన్ని ఇస్తున్నాయి. 

అత్యంత కరడు కట్టిన జాతీయవాదిగా ఖ్యాతి గాంచిన నరేంద్ర మోడీ తానూ తీసుకున్న నిర్ణయం ఇంతవరకూ వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు. అయితే

ఒక్కసారిగా మూడు రైతు సంఘాలు వెనక్కి తీసుకుంటూ రద్దు చెయ్యడం పై పార్టీ వర్గాల్లోనే సంచలనంగా మారింది. 

కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారం లోకి రావాలి అంటే, త్వరలో జరుగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ప్రస్తుతం తీసుకున్న ఈ చట్టాల నిర్ణయం ఉత్తర ప్రదేశ్

లో యోగి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం డిఫెన్సె లో పడింది. అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తేనే కేంద్రం లో ఎక్కువ మంది ఎంపిలతో అధికారంలోకి రాగలిగేది. దీంతో యోగి ని కచ్చితంగా గెలిపించాల్సిన  అవసరం పార్టీకి ఉంది.   
ప్రస్తుత పరిస్థితుల్లో రైతు ఉద్యమం ను సాకుగా చూపి ప్రతిపక్షాలు దేశంలో అల్లకల్లోలం

సృష్టిస్తున్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 

దీనికి కట్టడి వేసి, దేశంలో సుస్థిరమైన పాలనా కొనసాగాలి అంటే అది కేవలం బీజేపీ తో మాత్రమే సాధ్యమని, దానికోసం తక్షణం తీసుకోవాల్సిన చర్య, రైతు ఉద్యమాన్ని శాంతింపచెయ్యాలి. దాని కోసం మడమ తిప్పని, మాట వెనక్కి తగ్గని నాఇంద్రుడు సైతం రేటు చట్టాలను రద్దు చెయ్యడమే

కాక, ప్రజలకు క్షమాపణ కూడా చెప్పారు అంటే. . భవిష్యత్ కోసం బీజేపీ ఏ స్థాయిలో ప్రణాళిక వేసిందో తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam