DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పామరులకు సైతం పరమావధి అందించే వైదిక పాఠశాల ఇదే

*యాజ్ఞీక పీఠం 17 వ వార్షికోత్సవం సందర్భంగా DNS ప్రత్యేక కథనం*  

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, నవంబర్ 23, 2021 (డిఎన్ఎస్):* సనాతన హిందూ వైదిక సంప్రదాయ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు యాజ్ఞీక పీఠం. తెలంగాణ లోని భాగ్యనగరం లో వెలసిన ఈ వైదిక విద్యాలయం గత 17 సంవత్సరాలుగా నిర్విరామంగా సనాతన హిందూ

సంప్రదాయ వైదిక విద్యను సామాన్యులకు సైతం అందిస్తు, అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక సంస్థ ఇది. రానున్న డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో జరుపుకోనున్న వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 108 హోమ కుండాలతో స్వామికి ఆగమ నీరాజనం అందించనున్నారు.   దీనికై ఋత్విక్ లకు 15 రోజుల పాటు కఠిన నియమాలతో ప్రత్యేక శిక్షణ ను కూడా అందిస్తున్నారు. ఈ

వైదిక పాఠశాల వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.  

ఆర్ధిక, లౌకిక వ్యవహారాలపై మక్కువతో గత రెండు తరాలుగా హైందవ సమాజం పాశ్చాత్య పోకడలకు లోనై, సనాతన వైదిక విద్యను దూరం చేసుకోవడం తో ఎన్నో విపత్కర పరిస్థితులను నాటి సమాజం ఎదుర్కొంది.

వైదిక విద్య వైభవాన్ని తెలుసుకున్న నేటి తరం తమకు

కూడా ఈ వైదిక విద్యను అభ్యసించాలి అనే ఆసక్తి కల్గింది. అయితే ప్రస్తుతం సమాజంలో ఉన్న విద్యా సంస్థలు చిన్న పిల్లల వయసు వారికి మాత్రమే నేర్పించడం జరుగుతోంది తప్ప, యువత, మధ్యవయస్కులు, వృద్దులు, మహిళలకు నేర్పించే సంస్థలు లేవు. 

అయితే విద్య ను నేర్చుకోలేక పోతున్నాం అని ఈ వయస్కులకు అండగా నిలిచి వీళ్ళకు సనాతన

వైదిక వైభవాన్ని అందించాలి అనే సంకల్పం కల్గిన యువకులు పిటిజి కిషోర్ స్వామి ఆశయం కు ప్రత్యక్ష నిదర్శనమే యాజ్ఞీక పీఠం.  
ఆలోచన వచ్చిన క్షణం నుంచి నేటి వరకూ చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకూ అన్ని స్థాయిల వారికీ ఉపయోగపడే ఆధ్యాత్మిక, వైదిక విద్యను అందించేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. 

2010 లో

ఆవిర్భవించినప్పడికీ కనీస మౌలిక వసతులు ఏర్పాటు, అందరికి అనువైన ప్రాంగణం తదితర ఏర్పాట్లు సమకూర్చుకుని కార్యాచరణ మొదలు పెట్టడానికి ఎంతోశ్రమించారు. ఒక్కొక్క అడుగు వేస్తూ, బుడిబుడి నడకలతో నేటికీ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 వ సంవత్సరంలోకి పరుగులు పెడుతోంది. 

ఆ యువకుని ఆశయం. . అద్వితీయం ..:

పిటిజి

కిషోర్ స్వామి . . ఈ పేరు వినని వైదిక సంప్రదాయ పరులు నేటి సమాజంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఆశ్రమ గురుకుల వాతావరణం లో చిన్నారులకు వేదవిద్యను అందిస్తూ, యువకులకు వారాంతపు, వేసవి శిక్షణ శిబిరాల ద్వారా అర్చక, ఆగమ, హోమ విధాన ప్రక్రియ, మహిళలకు ఆధ్యాత్మిక గ్రంధాల పరిచయం, పారాయణ తరగతులు, అర్చకులకు ఆలయాల్లో అవసరమైన అర్చనలు,

హోమ నిర్వహణ అత్యంత క్రమశిక్షణ తో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. 

ప్రత్యక్షంగా తరగతులకు హాజరు కాలేని వారి కోసం ఆన్ లైన్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గత కొన్నేళ్ల క్రితమే ఆరంభించిన విజ్ఞాన గని కిషోర్ స్వామి.  గత దశాబ్దన్నర కాలం లో వీరి ద్వారా వైదిక విద్యను అభ్యసించిన వారు నేడు ఎన్నో దేవాలయాల్లోనూ,

ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ అసామాన్య ప్రతిభను కనపరుస్తున్నారు. వివిధ పీఠాల ఆధ్వర్యవంలో నిర్వహించే గురుకుల పాఠశాలలకు ధీటుగా యాజ్ఞీక పీఠ పాఠశాలను నిర్వహిస్తూ, ఇక్కడ వైదిక విద్యను నేర్చుకున్న విద్యార్థులకు సర్వత్రా ఆదరణ కనపడుతోంది అంటే. .  శిక్షణ తరగతులను వీరు ఎంత క్రమశిక్షణతో నేర్పుతున్నారో

బహిర్గతమవుతోంది. 

సమాజ వైదిక అవసరాలకు అండ ...దండ. .. 

ఈ సంస్థ కేవలం విద్యార్థులకు విద్యను నేర్పించడంతో మాత్రమే సరిపెట్టుకోలేదు. సమాజంలోని వైదిక అవసరాలను పరిపూర్ణం చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని కూడా అందిస్తోంది. వయో భేదం లేకుండా “ఉచిత 100 రోజుల వైదిక అర్చక (పూజారి) శిక్షణా కార్యక్రమాలను

నిర్వహిస్తున్నారు. కఠినమైన శిక్షణ సమయంలో ఉచిత వసతి, బోర్డింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. 

మహా మహా ఆధ్యాత్మిక పీఠాలు, దేవాలయాలు, సంస్థలు సైతం కొన్ని వైదిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీళ్ళ సహకారం తీసుకోవడం తప్పని సరిగా మారింది. వాళ్లకి అవసరాలకు అనుగుణంగా ఋత్విక్ లను అందించడం, గ్రంథ

పారాయణదారులను పంపడం, వంటివి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి నిదర్శనమే. . నాటి నుంచి నేటి వరకూ జరిగిన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సంస్థ విద్యార్థులు నిర్వహించడమే నిదర్శనం.

నేర్పించే గ్రంధాలూ, విద్య: 

శ్రీవైష్ణవ సంప్రదాయం లో యువతకు సంధ్యావందనం, తిరువారాధన, తిరుప్పావై, తిరుపళ్ళి

ఎజూచి, తిరువాయ్ మొజి, నాలాయిర ప్రబంధం నేర్పించడం తో పాటు నిత్య హోమం, అష్టోత్తర కుండాత్మక యాగాల్లో పాల్గొనే హోతలు, ఉప హోతలను కూడా శిక్షణ ఇచ్చి నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు.    

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో అనేక పునరుద్ధరణలు, ఆలయాల ప్రతిష్ఠాపన, యజ్ఞాలు, యాగాలు, పవిత్ర హోమాలు, వైదిక

పారాయణాలు, ప్రవచనాలు, సామాజిక సేవా కార్యక్రమాలు మరియు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam