DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగరం లో ఆటోల బంద్ కు ప్రజల సంఘీభావం

విశాఖపట్నం, ఆగస్టు 7 , 2018 ( DNS Online ):  à°†à°Ÿà±‹ కార్మికులపై రవాణా శాఖ అధికారుల వేధింపులు భరించలేని పరిస్థితుల్లో పలు ఆటో రిక్షా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు

మంగళవారం నగరం లో ఆటోల బంద్ ప్రశాంతంగా జరిగింది. దీనికి ప్రజలు సైతం సంఘీభావం ప్రకటించడం గమనార్హం. పలు చోట్ల కొందరు డ్రైవర్లు ఆటోలు నడపడంతో వారిని

సముదాయించి బంద్ ను పరిపూర్ణం చేసిన ఘటనలూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న మోటార్ వాహన చట్ట సవరణ తో రోడ్ల పై ఆటోలు నడిచే

అవకాశం లేదని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కె. సత్యనారాయణ తెలిపారు. తక్షణం ఈ నూతన చట్ట సవరణ ను రద్దు చెయ్యాలని, ఆర్టీఓ అక్రమంగా ఆటో డ్రైవర్ల పై

పెడుతున్న కేసులను బేషరతుగా ఉపసరించాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను తగ్గించాలని, అక్రమంగా వేస్తున్న పెనాల్టీలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు కళ్ళుమూసుకు పోయి, వాళ్ళ జీవితాలతో ఆటలాడుతుంటే, లక్షలాది రూపాయలు వివిధ బ్యాంకు ల ద్వారా రుణాలు తీసుకుని,

స్వయం ఉపాధి పొందుతున్నారని వాళ్లపై ఈ రవాణా అధికారులు అక్రమంగా కేసులు పెట్టి భయ భ్రాంతులని చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓర్వలేక,

నిరుద్యోగుల జీవితాలపై కొరడా ఝుళిపిస్తున్నారన్నారు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ పోలీసులు, ఆర్టీఓ అధికారులు తనిఖీల పేరిట లక్షలాది రూపాయలు

గుంజుకుంటున్నారన్నారు. ఇది చాలదన్నట్టు నూతన రోడ్డు రవాణా బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశ పెట్టిందన్నారు. ఈ

బిల్లు గాని ఆమోదం పొంది అమలు లోకి వచ్చినట్లయితే ఆరో కారికులకే కాక, ఇతర ద్విచక్ర వాహన దారులు సైతం రోడ్లపై బళ్ళు నడపలేరన్నారు. పైగా ఆటోలు ప్రతి రోజు రాత్రి 7

à°—à°‚à°Ÿà°²  à°¨à±à°‚à°šà°¿ ఉదయం 5  à°—à°‚à°Ÿà°² వరకూ జాతీయ రహదారిపై నడప కూడదు అని అడ్డగోలు నిబంధనలు పెట్టడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది కరమేనన్నారు. సమాజం లో ప్రజలకు అత్యంత

అందుబాటులో ఉండే రవాణా సదుపాయం ఆటోలేనని, అందరూ కార్లలో తిరగలేరని, ప్రధానంగా రాత్రి వేళల్లో అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండే వాహనం ఆటోయే నన్నారు. అలాంటి

వాటిపై నిషేధం విధిస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడతారన్నారు. నిరుద్యోగులకు కనీసం ఉద్యోగం, ఉపాధి కల్పించడం చేతగాని పాలకులు ఆటో కార్మికులను పీడించుకు

తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరం లో దాదాపు గా రోడ్లన్నీ ఆటోలు తిరగక బోసిపోయాయి. పలు చోట్ల స్కూల్ ఆటోలకు, ఆసుపత్రులకు వెళ్లే ఆటోలకు మాత్రం

వేసులుబాటు కల్పించారు. 

 

#dns #dnsnews #dns news #dnslive #dns live #dnsmedia #dns media #vizag #visakhapatnam #auto rikshaw #auto #strike #bandh #auto strike #auto bandh

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam