DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాలయాల్లో ఈ బోర్డులు పెట్టి అర్చకులను అవమానిస్తారా?

దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయం కాదు   

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 03, 2021 (డిఎన్ఎస్):* అర్చకులకు స్కేల్ ఇచ్చి ఉన్నాం. అందువల్ల ప్లేట్ కలెక్షన్ రద్దు చేయడం అయినది. . .. అంటూ ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ అధికారులు దేవాలయాల్లో పెట్టిన బోర్డులు అర్చకులను అవమానించే విధంగా

ఉన్నాయని అర్చక సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

దేవాలయాల్లో అర్చకులకు వేతనం ఇస్తున్నారు ట, కాబట్టి భక్తులు వాళ్లకి సంభవం ఇవ్వకూడు అంటూ భక్తులను దేవాదాయ శాఖా హుకుం జారీ చేస్తోంది. అంటే .. అర్చకుల పట్ల తమకు ఉన్న అభిమానము వల్ల భక్తులు ఇచ్చే సంభవనలను కూడా దేవాదాయ శాఖా దోచుకుతింటుంది అనేది దీని

అర్ధం అని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
అర్చకులు దేవాలయంలో మూల విరాట్ కు చేసే సేవలకు అనుగుణంగానే భక్తులు గుళ్లకు రావడం జరుగుతుందని, అంతేతప్ప దేవాదాయశాఖ వసూలు చేసుకునే టికెట్ల వల్ల కాదని మండిపడుతున్నాయి. 

హిందూ దేవాలయాల్లో ఈ దోపిడీ శాఖా ఉండవలసిన అవసరం ఏంటని మండిపడుతున్నాయి. ఆలయాల

అభివృద్ధి కోసం ఆలయాల్లోని హుండీ ల్లో భక్తులు వేసే ముడుపులు కానుకలను దోచుకోవడం తప్ప దేవాదాయశాఖ ఆలయాల అభివృద్ధి కి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి అయినా ఇచ్చిన పాపాన పోలేదని, అలాంటిది భక్తులపై ఆంక్షలు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఆలయాలు అనేవి ధార్మిక కేంద్రాలే తప్ప, ప్రభుత్వ కార్యాలయాలు

కాదని, అందునా లంచాలు తీసుకునే తిమింగలాలు చూసినట్టు అర్చకులను జమకట్టడం అత్యంత దారుణమని మండిపడుతున్నాయి. 

అర్చకులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా జమకడితే.  . ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలన్నీ కల్పిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే డ్యూటీ టైమింగ్స్ పెట్టాలని, ప్రతి

ఆదివారం సెలవు కూడా ప్రకటించాలని, ఇలా అన్ని సదుపాయాలూ అమలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాయి ధార్మిక సంఘాలు.  

హిందూ దేవాలయాలు ధార్మిక కేంద్రాలే తప్ప, కార్యాలయాలు కాదని, కేవలం హిందూ దేవాలయాలపైనే మీ పెత్తనం ఏంటని, ఇతర మతసంప్రదాయ ప్రార్ధన మందిరాలను కూడా దేవాదాయ శాఖా పరిధిలోకి తీసుకువచ్చి, అక్కడ కూడా ఇదే

తరహాలో మీ అధికారం చెలాయించ గలరా అని సవాల్ విసురుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam