DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళికి ధన్యత కలిగించే వ్రతం ధనుర్మాస వ్రతం

*17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

*విశాఖపట్నం, డిసెంబర్ 10, 2021 (డిఎన్ఎస్):* అత్యంత విశిష్టమైన ధనుర్మాసోత్సవాలు ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకూ విశ్వ వ్యాప్తంగా అన్ని శ్రీవైష్ణవ దేవాలయాల్లోనూ, సంప్రదాయపరుల గృహాల్లోనూ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 16 న మ‌ధ్యాహ్నం 12.26

గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. అన్ని శ్రీవైష్ణవ ఆలయాల్లోనూ అంకురారోపణ జరుగనుంది. మరునాటి నుంచి తెల్లవారుఝామునే సుప్రభాత సేవలో సుప్రభాతం కు బదులుగా తిరుప్పావై సేవాకాలం చేయనున్నారు. శ్రీరంగం, తిరుమల తిరుపతి దేవస్థానములు, సింహాచలం, భద్రాచలం,  మంగళగిరి సహా అన్ని క్షేత్రాల్లోనూ ఇదే సంప్రదాయం

ఆచరిస్తుంటారు. 

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం : పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…

12

మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే

తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ఇదే సమయంలోనే వచ్చే పరమ వైశిష్ట్యమైన పర్వదినోత్సవం వైకుంఠ ఏకాదశి, దీన్నే ముక్కోటి అని పేరు. ఈ

రోజున పరమపదంలోని శ్రీ మహావిష్ణువు భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనం అనుగ్రహించడం తో, ఆ స్వామి ని అక్కడ దర్శించిన వారికి జన్మరాహిత్యమేనని భక్తుల విశ్వాసం. 

వైకుంఠ ఏకాదశి కి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam