DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*చిన్నజీయర్ స్వామి వారి సమతామూర్తి తో భారత్ కీర్తి విశ్వవ్యాప్తం* 

*చరిత్ర సృష్టించనున్న 216 అడుగుల రామానుజ సమతా ప్రాంగణం*  

*సమాజ శ్రేయస్సు కై సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మి నారాయణ యాగం*  

*వెయ్యేళ్ళ క్రితమే సమాజ సమానతకై అడుగు వేసింది రామానుజులే* 

*ఈ ప్రాంగణం ఒక ధార్మిక, శాస్త్ర సాంకేతిక సమ్మిళిత వైజ్ఞానిక గని:* 

*8 న సాధు సమ్మేళనం, 10 న

సామాజిక వేత్తలతో సమ్మేళనం:* 

*విశాఖపట్నం, జనవరి 22, 2022 (డిఎన్ఎస్):* అపరరామానుజులుగా ఖ్యాతిగాంచిన పరమ హంసపరివ్రాజకాచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి భాగ్యనగరం లో నిర్మిస్తున్న 216 అడుగుల సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం తో భారత ఖ్యాతి విశ్వ విఖ్యాతం కానుంది.   
వెయ్యేళ్ళ క్రితమే సమాజంలోని

అసమానతలను తొలగించి, అందరికి మోక్షం లభించాలని, ఆలయ గోపుర శిఖరం ఎక్కి మహిమాన్వితమైన అష్టాక్షరీ మహా మంత్రాన్ని అందించి, ఆలయ దర్శనం కల్పించిన మహనీయులు భగవద్రామానుజులు. వారు అవతరించి వెయ్యేళ్ళు గడిచిన పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ శ్రేయస్సు కోసం సుమారు 5000 మంది సుశిక్షితులైన వైదిక  ఋత్విక్ లచే 1035 హోమ

కుండలతో ఎంతోమహిమాన్వితమైన శ్రీలక్ష్మీ నారాయణ యాగాన్ని నిర్వహిస్తున్నారు చిన్న జీయర్ స్వామి. 

రామానుజులు ఈ సమాజానికి అందించిన మహోన్నత కార్యాచరణలో అత్యంత ముఖ్యమైనవి అందరికి మోక్షం లభించే అర్హత ఉందని, అయితే దానికి తగిన సాధన చెయ్యాలని తెలియచేస్తూ. . .ఆలయ గోపుర శిఖరానికి ఎక్కి కేవలం కొందరు సాధకులకే

పరిమితమైన అష్టాక్షరీ మహా మంత్రాన్ని నాటి సమాజంలో ప్రజలందరికి అందించారు. అదే క్రమంలో ప్రతి ఒక్కరికి ఆలయ దర్శనం చేసుకునే అర్హత ఉందని, సమాజంలోని వారందరూ స్వామి వారి సంతానమేనని తెలిపి, వారందరికీ స్వయంగా ఆలయ దర్శనం అందించారు. ఎన్నో ఆలయాలను సంస్కరించి, ఎందరికో మార్గదర్శకంగా నిలిచినా రామానుజాచార్యులు చరిత్ర భావి

తరాలకు తెలియచేసేందుకు అపరరామానుజులుగా ఖ్యాతి గాంచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి తమ ఆశ్రమం ప్రాంగణంలో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ను నిర్మింపచేశారు. ఈ ప్రాంగణానికి సమతా మూర్తిగా నామకరణం చేయడం జరిగింది. ఈ ప్రాంగణం లో ప్రధాన ఆలయంలో రామానుజుల సువర్ణ మూర్తి ని ఏర్పాటు చేయసాగారు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత

ప్రాధాన్యత కల్గి, 12 మంది ఆళ్వార్ల చే కీర్తించబడిన 108 దివ్యక్షేత్ర ఆలయాలను కూడా ఇదే ప్రాంగణంలో నిర్మింపచేసారు. ప్రతి ఆలయం వద్ద ఆ ఆలయ చరిత్రను తెలిపే విధంగా డిజిటల్ విధానం కూడా ఉంది.   

ఈ సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5 న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఆలయంలోని 120 కిలోల బంగారం తో

రూపుదిద్దుకున్న 54 అంగుళాల రామానుజ సువర్ణ మూర్తి ని భారత రాష్ట్రపతి రామ్ నాధ్  కోవింద్  ఫిబ్రవరి 13 ఆవిష్క‌రించ‌నున్నారు. 

ధార్మిక, శాస్త్ర సాంకేతిక సమ్మిళిత వైజ్ఞానిక గని: 

ఈ ప్రాంగణం సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి నిర్మాణం ఒక వినూత్న విషయాన్నీ

తెలియచేస్తుంది. ఆధ్యాత్మిక రంగంలోని వారికి ఆధ్యాత్మిక విషయాలు, విద్యార్థులకు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పెద్దలకు ఆహ్లాదాన్ని, ధార్మిక వేత్తలకు ధర్మ సంబంధ అంశాలను తెలియచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. చిన్నారులకు, సాధారణ వీక్షకులకు విద్యుదీకరణ కల్గిన ఫౌంటెన్ లు ఎంతో ఆహ్లాదాన్ని కల్గించబోతున్నాయి.

ఇప్పడికే దేశ విదేశాల నుంచి ఎందరో పరిశోధకులు ఈ ప్రాంగణ నిర్మాణాలపై ఎన్నో పరిశోధనలకు సిద్దపడుతున్నారు. 

ఇప్పడికే ఈ ప్రాంగణం ప్రపంచ రికార్డుల్లోకి సైతం చోటు దక్కించుకుంది. ఈ నిర్మాణంలో ఎందరో ఇంజనీర్లు, శిల్పులు, వేలాదిగా వ్యక్తులు శ్రమించి అద్భుతమైన ప్రాంగణంగా తీర్చిద్దడం లో ప్రధాన భూమిక

వహించారు.

సహస్రాబ్ది సమారోహం ఇదే: . .

ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట భాగ్యనగరంలోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లో ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ చేసి, వాటికి  కుంభాభిషేకం కొనసాగుతుంది. ఈ ప్రాంగణంలో

శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 106 శ్రీ వైష్ణవ ఆలయాలతో పాటు, పరమపదం, శ్రీవైకుంఠం ఆలయాలను కూడా సిద్ధం చేసారు.    

ఈ మహోన్నత ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని సమస్త సమాజ శ్రేయస్సుకు, మానవాళి మనుగడ మహోన్నతంగా ఉండాలి అనే సంకల్పంతో చిన్న జీయర్ స్వామి

వారు ఇదే ప్రాంగణంలో 1035 హోమకుండలతో 12 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 5 వేలమంది ఋత్విక్ లతో నిత్యం కోటి అష్టాక్షరీ మహా మంత్ర హవనం, వేదపండితులు తో దివ్యప్రబంధ, పురాణం, ఇతిహాసాల తదితర గ్రంధాల పఠనం నిర్విరామంగా శ్రీలక్ష్మి నారాయణ మహా యాగం జరిపించనున్నారు.    

ఒక్కో దిక్కులోను 36 యాగశాలలు చొప్పున నాలుగు

దిక్కుల్లో మొత్తం 144 చోట్ల యాగ శాలలు నిర్మింప చేసారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టి శాలలు ఉన్నాయి. 

హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే

ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్రత్యేక కవర్‌లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమ కుండంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని

తొమ్మిది హోమ కుండాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు.  

ఆకట్టుకునే రంగుల ఫౌంటెన్, లేజర్ షో: 

సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి

ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్‌ ఫౌంటెన్‌ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు.  ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్‌ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్,

సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేసారు. 

భావి తరాల భవిష్యత్ కోసం :

సమానత్వానికి వేయేళ్లపాటు ప్రతీకగా నిలిచిన రామానుజచార్యుల వారి బోధనలను మరో వెయ్యేళ్ల పాటు భావితరాలకు అందించేందుకే చిన్న జీయర్ స్వామి పంచలోహ సమతా మూర్తి ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టారు. 

ఈ ప్రతిమ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద

విగ్రహంగా  రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్ లో అతిపెద్ద విగ్రహంగా థాయ్ లాండ్ లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది. 

8 న సాధువులతో, 10 న సామాజిక వేత్తలతో సమ్మేళనాలు: 

దేశ వ్యాప్తంగా ఉన్న సాధుసంతు ల‌తో ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో ‘‘ధర్మ సమ్మేళనం’’ నిర్వహించనున్నారు. దీనికి

దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, సంత్ లు, ధార్మిక ప్రచార కర్తలు, సంఘ్ పరివార్ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ మోహ‌న్ భ‌గవత్ ఫిబ్రవరి 9వ తేదీన హాజరు కానున్నారు. ఈ సభల్లో 8,9,10 తేదీలలో భయ్యాజి జోషి, భాగయ్యలు ఈ ఉత్స‌వాల్లో పాల్గొంటారు. 10 న సామాజిక సామారస్యత దృష్ట్యా ‘‘ సామాజిక

నేతల సమ్మేళనం ’’ జరగనున్నాయి.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam