DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నన్నయ విద్యార్థులు చరిత్ర సృష్టించాలి : నైనా జైస్వాల్

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnami )*

*విశాఖపట్నం, మార్చి 09, 2022 (డిఎన్ఎస్):* ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి, ఉన్నత స్థానాలకు చేరుకొని చరిత్ర సృష్టించాలని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి, నైనా జైస్వాల్ అన్నారు. ప్రస్తుతం ఆమె ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి

విద్యార్థిగా పరిశోధన చేస్తున్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, జక్కంపూడి విజయలక్ష్మీ ఆయా రంగాల్లోన్ని మహిళ ప్రముఖులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి

కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిశోధన చేయడం ఆనందంగా ఉందని అన్నారు. వీసీ జగన్నాథరావు లాంటి మహనీయుని మార్గదర్శకంలో విశ్వవిద్యాలయ విద్యార్థులంతా చరిత్ర సృష్టించాలన్నారు. ప్రకృతి ప్రేమతో కట్టిపడేసే జిల్లా తూర్పుగోదావరి జిల్లా. మంచి చేయాలనే ఆలోచన

గోదావరి జిల్లా వాసుల రక్తంలోనే కాదు, తత్వంలో కూడా ఉంటుందని నమ్ముతున్నాను తెలిపారు. దైర్యసాహసాలకు ప్రతిక అయిన గోదావరి కోడలు రాణీరుద్రమ్మదేవిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. గమ్యం స్థిరంగా ఉండాలని, మాట కచ్చితంగా గుర్తించుకోవాలని అప్పుడే విజయమోగ్గు చూపిస్తుందని చెప్పారు. పుట్టుక, పేరు, గౌరవం

ఇచ్చిన గోదావరి జిల్లాలను మర్చిపోవద్దన్నారు. తీసుకున్న నిర్ణయం తప్పు అయితే నాది, ఒప్పు అయితే మనది అనే మంచి మనిషి వీసీ జగన్నాథరావు అని తెలిపారు. ప్రతీ ఇంటికి కూతురు ఉండాలని, ఆడపిల్లను చిరునవ్వు శాస్వత ఆనందాన్ని ఇస్తుందన్నారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని, గుడిలో లేని దైవం అమ్మని కొనియాడారు. యువతకు పెద్ద దెయ్యం

టీవీ, చిన్న దెయ్యం సెల్ ఫోన్ అని  వీటికి దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్ సాధ్యమవుతుందని తెలిపారు.  ఇష్టంతో సాధన చేస్తే గెలుపు సాధ్యమవుతుందని, పాకిస్తాన్ లో మన జాతీయ జెండా రెపరెపలాడించినప్పుడు గెలుపు ఆనందాన్ని చవిచూసానన్నారు. చక్కని అవకాశాన్ని కల్పించిన వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావుకు, గైడ్ ఆచార్య ముర్రు

ముత్యాలు నాయుడుకు, కోగైడ్ ఆచార్య ఎస్.టేకి కి కృతజ్ఞతలు తెలిపారు. వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మాట్లాడుతూ సుస్థిరమైన రేపటి కోసం నేడు స్త్రీ, పురుషులు సమానంగా అభివృద్ధి సాధించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ ఉద్దేశాన్ని వివరించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మహిళాలు కీలక పాత్రను పోషిస్తున్నారని,

విశ్వవిద్యాలయ పరిపాలనలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. సమాజంలో 50 శాతం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖారలకు ఎదగాలని పురుషులతో సమానంగా స్త్రీలు ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. భారతదేశంలో యంగ్ పి.హెచ్.డి స్కాలర్ గా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుండి నైనా జైస్వాల్ ఉండడం హర్షణీయమని అన్నారు.

విద్యార్థులు ఇటువంటి వారిని స్పూర్తిగా తీసుకొని ఆయా రంగాల్లో ప్రతిభను సాధించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మహిళాసభ అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలోను, సంఘసంస్కరణలలోను పాటుపడిన మహిళామూర్తులను ప్రస్తావిస్తూ మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అంతకు ముందు నిర్వహించిన

విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సదర్భంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వివిధ పోటీలలోని విజేతలకు అతిథుల చేతులు మీదిగా బహుమతులను అందజేసారు. అనంతరం అతిథులను సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉమెన్స్ సెల్ కోఆర్డినేటర్ డా.కె.నూకరత్నం, ఆంధ్రప్రదేశ్ మహిళాసభ

అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, నేషనల్ టిటి ప్లేయర్ సుంకర నాగేంద్ర కిషోర్, ఆదిత్య ఇన్సిట్యూట్ డైరెక్టర్ డా. ఎన్. సుగుణ, ఎన్.జి.ఓ టి.జయశ్రీ, విశ్రాంత ఉద్యోగిని పి. పద్మజ వాణి, ప్రిన్సిపాల్స్ ఎస్.టేకి, డా. కె.రమణేశ్వరి, డా.వి.పెర్సిస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam