DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ అసెంబ్లీ ఫలితాలు బీజేపీ పాలనలో ప్రజాసేవకు నిదర్శనం

*విశాఖ ఉత్తరం మాజీ ఎమ్మెల్యే విష్ణు సారధ్యంలో సంబరాలు*

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 10, 2022 (డిఎన్ఎస్):* గురువారం ఐదు రాష్ట్రాల్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ చేసిన ప్రజాసేవకు నిదర్శనమని  బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ పి.విష్ణు

కుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ శాసనసభల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు అనూహ్య పట్టం కడుతూ ఓటింగ్ చేశారన్నారు. వీటిల్లో పంజాబ్ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని అయన ఇంటి వద్ద బీజేపీ క్యాడర్

 విజయోత్సవ భారీ సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం బాలయ్యశాస్త్రై లే అవుట్ కోలనీ వీధుల్లో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam