DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరకులో అల్లూరి మ్యూజియం ప్రారంభానికి ప్రధాని రాక 

*రాజమండ్రిలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ప్రారంభం* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 26, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా అరకులో ఏర్పాటు చేస్తున్న అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య

ప్రాంత అభివృద్ధి  మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో స్థానిక ప్రభుత్వ ఆర్ట్ కళాశాల మైదానంలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ప్రారంభమయ్యింది. దీనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ

కార్యక్రమం లో భాగంగా రాష్ట్రానికి చెందిన జానపద, గిరిజన కళలు, నృత్యం, సంగీతం, వంటకాలు, సంస్కృతిని ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించడంలో ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం’ కీలకపాత్ర పోషించిందన్నారు. 

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’  - "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" దక్షిణాది రాష్ట్రాల గొప్ప సంస్కృతిని ప్రదర్షించే

కార్యక్రమాలు.   భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని విభిన్న సంస్కృతులను  స్థానిక జనాభాకు పరిచయం చేస్తున్నాయన్నారు.

సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చే మహాయజ్ఞమే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ అన్నారు. ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్’ అనేది సాంస్కృతిక మంత్రిత్వ

శాఖ నిర్వహించే భారతదేశ ప్రధాన వేడుక అన్నారు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌ ను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించారు, అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దీనిని  ఆ వ్యవధిలో నిర్వహించలేకపోయారన్నారు.

మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో జరుపుకుంటున్నామని

తెలిపారు.

కార్యక్రమ వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి:

1. రాజమండ్రి- 2 రోజులు ( 26.3.22 ,  27.3.22) - శని, ఆదివారం
2. వరంగల్- 2 రోజులు ( 29.3.22 ,  30.3.22) - మంగళవారం,  బుధవారం
3. హైదరాబాద్- 3 రోజులు (01.04.22 నుంచి 03.04.22 వరకు) - శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరుగుతాయన్నారు. 

ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వం,  కళలను సుసంపన్నం

చేయడానికి కృషి చేసిన వారినీ భారత ప్రభుత్వం తరపున సత్కరిస్తామని అన్నారు.

జూన్ 21న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమం  విజయవంతం అయ్యే   సందర్భంగా జరుపుకునే యోగా దినోత్సవంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

మాట్లాడుతూ ఈ పండుగలు మన సంస్కృతి  సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ఉత్సవాలు నిర్వహిస్తోందని, దేశ ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయన్నారు. దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించిన జాతీయవాద నాయకులలో సుభాష్ చంద్రబోస్ ఒకరని

మంత్రి కొనియాడారు.

కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, తదితరులు సాంస్కృతిక ఉత్సవానికి హాజరయ్యారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam