DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంచాంగకర్తలూ పండుగ తేదీలపై విరుద్ధ ప్రకటన చేయవద్దు 

*ఏపీ పంచాంగ కర్తలకు  స్వాత్మానందేంద్ర స్వామి సూచన* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 28, 2022 (డిఎన్ఎస్):*  పండుగ తేదీల విషయంలో పంచాంగకర్తలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయవద్దని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పంచాంగకర్తలకు సూచించారు. విజయవాడలో

ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భావ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా పంచాంగకర్తల ను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు. ఒకే పండుగపై ఒక్కో పంచాంగంలో ఒక్కో తేదీని ప్రకటించడం వల్ల హేతువాదులు విమర్శించడానికి ఆస్కారం ఏర్పడుతోందన్నారు. తద్వారా టీవీ డిబేట్లకు తావు ఏర్పడుతోందని స్పష్టం చేసారు. ఈ

పరిస్థితిని అధిగమించాలంటే పంచాంగకర్తలంతా కలిసి ఏకీకృత పంచాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ విషయంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సహకరిస్తారని, పంచాంగకర్తలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంచాంగకర్తలంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడటం ముదావహమని

స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి, ప్రముఖ పంచాంగ కర్తలు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam