DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యాదాద్రి వానమామలై సూచనలతో నడిచే వైష్ణవ ఆలయమే: ఈఓ 

*ఇది హరిహరాద్వైత దివ్యక్షేత్రం:ప్రధానార్చకులు నరసింహాచార్యులు* 

*అర్చకుని వ్యాఖ్యలపై మండిపడుతున్న శ్రీవైష్ణవ సంఘాలు* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 31, 2022 (డిఎన్ఎస్):* యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ క్షేత్రం ఒక శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని మాత్రమే పాటించే

దివ్యక్షేత్రమని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. గీతా రెడ్డి తెలియచేస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రామాణిక శ్రీ వైష్ణవ వానమామలై పీఠం ఆధ్వర్యవంలో, వారి సూచనల మేరకు ఆలయంలో అర్చనాది పూజలు నిర్వహించే వ్యవస్థ ఇక్కడ ఉంది ఆమె ఆలయ మహాకుంబాభిషేకానికి ముందు మీడియా సమావేశాల్లోనే ప్రకటించారు. ఈ విషయం అందరికి తెలిసిందే. 
 
/> అయితే ఆలయ కుంభాభిషేకం పూర్తి అయినా తర్వాత ఆలయ ప్రధానార్చకులు నల్లందిఘళ్ లక్ష్మీ నరసింహాచార్యులు యాదాద్రి  క్షేత్రాన్ని హరిహరాద్వైత దివ్యక్షేత్రం అంటూ ప్రకటించడం పట్ల అందరూ విస్మయానికి గురయ్యారు. ఇతని వ్యాఖ్యలపై శ్రీవైష్ణవ సంఘాలు మండిపడుతున్నారు. 

ఇంతకీ యాదాద్రి క్షేత్రం ఈఓ చెప్పినట్టు వైష్ణవ

క్షేత్రమా లేక అర్చకుడు చెప్పినట్టు  హరిహరాద్వైత దివ్యక్షేత్రమా అనేది ఆలయ వర్గాలు గానీ, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా గానీ ప్రకటించాల్సి ఉంది. 

అర్చకుడు క్షమాపణలు చెప్పాల్సిందే : . .. 

ఎవరి ప్రలోభానికో లోనై అర్చకుడు లక్ష్మి నరసింహాచార్యులు తనకు జీవితాన్ని ఇచ్చిన యాదాద్రి లక్ష్మి నరసింహ

స్వామికే చెయ్యరాని ద్రోహం చేసారని అఖిల భారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఇతర శ్రీవైష్ణవ సంప్రదాయ పరులు మండిపోతున్నారు.  

ప్రధాన అర్చకులు మాట్లాడిన మాటలను నిర్విద్వంద్వంగా శ్రీవైష్ణవ సేవా సంఘం తెలంగాణ సంఘం ఖండిస్తోంది. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ అర్చక స్వామిపై చర్యలు

తీసుకోవాల్సిందిగా కోరుతోంది. ఈమేరకు సంఘం అధ్యక్షులు శృంగారం తిరువెంగళాచార్యులు, ప్రధాన కార్యదర్శి సేనాపతి మోహన్, పేరిట తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా కమిషనర్ కు ఒక లేఖ వ్రాసింది

అర్చకుడు చేసిన ప్రకటనలపై అన్ని ప్రాంతాల్లోని శ్రీవైష్ణవ సంఘాల ప్రతినిధులు, వైష్ణవ సంప్రదాయ పరులు

మండిపడుతున్నారు. 

ఇది చరిత్రను వక్రీకరించి చెప్పడమేనని, అక్కడ అర్చనలు శ్రీపాంచరాత్రాగమ పూర్వకంగా పూజాదికాలు జరిపించబడుతున్నాయి. ప్రసిద్ధ వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా యాదాద్రి దేవాలయం చెప్పబడుతోంది తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ సంఘాలు, సంప్రదాయపరుల నుంచి నిరసనలు పెరగక ముందే ఆయనపై తక్షణం

చర్యలు తీసుకోవాలని, వెంటనే అర్చకుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam