DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల క్షేత్ర చందన యాత్ర కు వాహన పార్కింగ్ ఇదే  

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 30, 2022 (డిఎన్ఎస్):*  మే 3 న జరుగనున్న శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం సందర్భంగా స్వామి దర్శనానికి సింహాచలం కు  వాహనాల మీద వచ్చే భక్తులకు, సూచనలు ఎగ్జిక్యూటివ్ అధికారి ఈఓ ఎంవి సూర్యకళ చేయడమైనది.

వాహనాలపై వచ్చే భక్తుల కొరకు కొండ

దిగువన అడవివరం జంక్షన్, పాత గోశాల జంక్షన్ మరియు పాత బస్ స్టాండ్ జంక్షన్ ల వద్ద పార్కింగ్ ప్రదేశములు ఏర్పాటు చేయడమైనది.

హనుమంత వాక వైపు నుంచి వచ్చే వాహనాలు: 

రూ. 1200/- మరియు రూ 1000/- టిక్కెట్లు కల్గియున్నవారు హనుమంతవాక జంక్షన్ మీదుగా వచ్చి తమ వాహనములను కృష్ణాపురం కొత్త గోశాల లేదా న్యూ టోల్ గేటు వద్ద

రెసిడెన్సియల్ స్కూల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకుని, అక్కడే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో కొండ మీదకు చేరుకోవలెను. దర్శనం అనంతరం అవే ప్రత్యేక బస్సులలో తమ పార్కింగ్ ప్రదేశాలకు చేరుకుని తమ తమ వాహనాలలో హనుమంతవాక మీదుగా వెళ్ళవలెను.

హనుమంతవాక వైపు నుండి వచ్చు Rs.300/- మరియు ఉచిత దర్శనం భక్తులు

అడవివరం జంక్షన్ చేరుకొని తమ వాహనములను అక్కడ ఆయా వాహనాలకు నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుకొని, అక్కడ నుంచి ఉచిత RTC బస్సులలో కొండ మీదకు చేరుకోవలెను.

సత్తరువు జంక్షన్  (శోంట్యాం రోడ్) వైపు నుండి వచ్చు Rs.300/- మరియు ఉచిత దర్శనం భక్తులు అడవివరం జంక్షన్ చేరుకొని తమ వాహనములను అక్కడ ఆయా వాహనాలకు

నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుకొని, అక్కడ నుంచి ఉచిత RTC బస్సులలో కొండ మీదకు చేరుకోవలెను. 


గోపాలపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు :

గోపాలపట్నం మరియు వేపగుంట వైపు నుండి కార్లు, ఆటోలలో వచ్చు Rs.300/- మరియు ఉచిత దర్శనం భక్తులు పాత గోశాల జంక్షన్ చేరుకొని తమ వాహనములను అక్కడ ఆయా వాహనాలకు

నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుకొని, అక్కడ నుంచి ఉచిత RTC బస్సులలో కొండ మీదకు చేరుకోవలెను. 

గోపాలపట్నం మరియు వేపగుంట వైపు నుండి ద్విచక్ర వాహనములపై వచ్చు భక్తులు సింహాచలం RTC బస్సు స్టాండ్ వరకు చేరుకొని, తమ వాహనములను అక్కడ ఆయా వాహనాలకు నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో నిలుపుకొని, అక్కడ నుంచి

ఉచిత RTC బస్సులలో కొండ మీదకు చేరుకోవలెను.

అడవివరం జంక్షన్ వద్ద విశాలమైన రోడ్లు మరియు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నందున భక్తులు సాధ్యమైనంత వరకు అడవివరం జంక్షన్ చేరుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

చందనోత్సవం సందర్భంగా విధులకు హాజరు అయ్యే అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది యొక్క ద్విచక్ర వాహనాలు కొండ

దిగువన గల సింహాచలం RTC బస్సు స్టాండ్ వద్ద కేటాయించబడిన ప్రత్యేక పార్కింగ్ ప్రదేశములలో నిలుపుకొని ఉచిత RTC బస్సులలో కొండ మీదకు చేరుకోవలెను. కొండ మీదకు ద్విచక్ర వాహనములు అనుమతించబడవు.
భక్తుల కొరకు దేవస్థానము వారు ఏర్పాటుచేసిన వాహనములు తప్ప మరియే ఇతర వాహనములు  చందనోత్సవం సందర్భంగా కొండమీదకు

అనుమతించబడవు.

మెట్ల మార్గం ద్వారా మరియు ఉచిత బస్సుల ద్వారా వచ్చే భక్తులు 3 వ తేదీ సాయంత్రం 6.00 గంటల లోగా దేవస్థానం కొండ పైకి చేరుకోవాలి. 6.00 గంటల తర్వాత మెట్లమార్గం మూసివేయబడుతుంది, ఉచిత బస్సుల సౌకర్యం కూడా ఆపివేయబడుతుంది.

వేసవి కాలం అయినందున భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ లకు టెంట్లు ద్వారా నీడను

కల్పించే ఏర్పాట్లు చేయడమైనది. 

క్యూలైన్లలో ఉన్న భక్తులకు  మంచి నీరు, మజ్జిగ, ORS ప్యాకెట్ లను ఉచితంగా దేవస్థానం కల్పిస్తుంది. 

అంతేకాకుండా 30 కి పైగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారం, మంచి నీరు అందించనున్నారు. 

ప్రసాదం లడ్డు విక్రయం కొండ దిగువన ఉన్న వాహనాలు పార్కింగ్ స్థలాలైన

న్యూ టోల్ గేట్ మరియు గోశాల వద్ద ఏర్పాటు చేయడమైనది.

కొండ దిగువన ఉన్న టిటిడి చౌల్ట్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడమైనదని ,భక్తులు సమాచారం తెలుసుకొనుటకు గానూ 0891-2715435 గల ఫోన్ నెంబర్ ను అందుబాటులో ఉంచడమైనది.

దేవస్థానం కొండపై భక్తుల కొరకు మౌలిక సదుపాయాలను

కల్పించడంతోపాటు, అగ్నిమాపక, అంబులెన్స్ సర్వీసులను కూడా దేవస్థానం ఏర్పాటు చేయడమైనది.

ఏడాదికొకసారి వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని భక్తులు శ్రద్ధతో, నమ్రతతో, నిశ్శబ్దం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని, వారి అనుగ్రహ ప్రాప్తిని పొందాలన్నారు. 

ఈ విషయమై భక్తులందరూ దేవస్థానం అధికారులకు,

సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam