DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల వీడియో అపచారం పై ఈఓ ను సస్పెండ్ చెయ్యాలి: బీజేపీ

*అది స్వామి అంతరాలయమా లేక ప్రదర్శన శాలా?: ధార్మిక సెల్ ఫణి*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 5, 2022 (డిఎన్ఎస్):* కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా సింహాచలం క్షేత్రంలోని శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి చందన యాత్రలో జరిగిన అపచారానికి నైతిక

భాద్యతగా ఆలయ ఈఓ ఎంవి సూర్యకళను తక్షణం సస్పెండ్ చెయ్యాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక కమిటీ సభ్యులు విజయ్ శంకర్ ఫణి డిమాండ్ చేసారు. గురువారం బీజేపీ ధార్మిక కమిటీ ఆధ్వర్యవం లో విశాఖ జిల్లా దేవాదాయ శాఖా ఉపకమిషనర్  శ్రీనివాస రెడ్డి కి ఫిర్యాదు పత్రం అందించారు. వివరాల్లోకి వెళితే. .. 

రెండు రోజుల

క్రితం సింహాచలం దేవస్థానంలో స్వామివారి నిజరూప దర్శనం జరిగింది. దీనికై వెళ్లిన భక్తుల్లో ఒకరు ఆలయంలోని మూల విరాట్ ను సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పెట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో అసలు మూల విరాట్ ను ఫోటో కూడా తియ్యకూడదని, ఆగమ శాస్త్రం చెప్తోందన్నారు. అలాంటిది ఏకంగా వీడియో

తియ్యడం అత్యంత దారుణమన్నారు. ఆలయ పవిత్రతను ఛిద్రం చేసేందుకు ఆలయ ఈఓ తన ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడమే కాక భక్తులకు ఏమాత్రం విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. కేవలం అర్చకులు, అనువంశక ధర్మకర్తలు మాత్రమే గర్భాలయంలోకి వెళ్ళవలసి ఉండగా, అధికార పార్టీకి చెందిన వందలాది మందిని యధేచ్చగా వదిలేశారన్నారు. ఎప్పుడూ లేని విధంగా

అంతరాలయ దర్శనాలు ఇష్టానుసారంగా కార్యనిర్వహణ అధికారి వదిలేశారన్నారు. దేవాదాయ శాఖా అధికారులు, ఆలయ సిబ్బంది మధ్య సమన్వయ లోపం కనిపించిందన్నారు. 
కార్యనిర్వాహణాధికారి సూర్యకళ దేవాదాయ శాఖా ఉద్యోగస్తులను పక్కనపెట్టి ఆవిడ కొడుకు, అతని స్నేహితులకు అంతరాలయంలో టికెట్లు బాధ్యత వారికి అప్పచెప్పడం అత్యంత

బాధాకరమన్నారు. 

ఈరోజు అంతరాలయంలో ఒక క్రమ శిక్షణ లేకుండా ధర్మకర్త మండలి సభ్యులను ఎవరిని పడితే వారిని అంతరాలయానికి సందర్శించే విధంగా ఏర్పాటు చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఆలయంలోపలికి వెళ్లిన వారి సెల్ఫోన్లను నియంత్రించ లేని ప్రధాన తప్పిదానికి నిదర్శనం  నిజరూపదర్శనం వీడియో సోషల్ మీడియాలో

దర్శనమిచ్చాయన్నారు. ఇది జరిగి 48 గంటలు అయినా ఈ అపచారానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోక పోగా ఈఓ కనీసం స్పందించక పోవడం ఆమె నైతిక భాద్యత వహించాలన్నారు. 

దేవాదాయ శాఖా డీసీ ని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam