DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీరమ్య తిరుమల వార్షికోత్సవాలకు రంగం సిద్ధం, మే 9 నుంచి వేడుకలు

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, మే 07, 2022 (డిఎన్ఎస్):* కోరిన కోర్కెలు తీర్చే దైవం గా వేలాదిమంది భక్తులచే కొనియాడబడుతున్న శ్రీ రమ్య తిరుమల లోని మహాలక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వరుడు వార్షికోత్సవాలు సిద్ధపడుతున్నాడు. మే 9 నుంచి 13 వరకూ అత్యంత  వైభవంగా శ్రీపాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం శ్రీ రమ్య తిరుమల ఆలయ 12 వ

వార్షికోత్సవ మహోత్సవాలు జరుగనున్నట్టు ఆలయ అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు తెలియచేసారు. 

శ్రీకాకుళం సిటీ నుంచి అరసవిల్లి వెళ్లే మార్గంలో గల  ఈ ఆలయంలో శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లు నిత్యం వైభవోపేతంగా ఆరాధనలు అందుకుంటున్నారు. 

మే 9- న సోమవారం సాయంత్రం 6.00 గంటలకు శ్రీ

విష్వక్సేన ఆరాధన, పుణ్యాహం, రక్షాబంధనం, ఋత్విక్ వరుణం, అంకురారోపణం తో ఉత్సవాలు ఆరంభమవుతాయి.

మే 10 న మంగళవారం ఉదయం 7.30 గంటలకు చతుః స్థానార్చన, 8.30 గంటలకు ఏకాశీతి (81) కలశస్నపనము (అభిషేకం) తో ఉదయం కార్యక్రమాలు ముగుస్తాయి. సాయంత్రం 4 గంటలకు గజవాహన సేవ (తిరువీధి), సాయంత్రం 5.30 గంటలకు చతుః స్థానార్చన, 6 గంటలకు  శ్రీ నారసింహ

హోమం తో రెండవ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి.  

మే 11 న బుధవారం ఉదయం 7.30 గంటలకు చతుఃస్థానార్చన. 8.30 గంటలకు నిశా చూర్ణోత్సవం పసుపు దంచుట, ఉ. 9 గం.లకు శ్రీ లక్ష్మి హోమం, సాయంత్రం 5 గంటలకు చతుఃస్థానార్చన, 6 గంటలకు కళ్యాణ మహోత్సవం. 

మే 12 వ తేదీ ఉదయం 7.30 గంటలకు చతుఃస్థానార్చన, ఉ. 8.30 గంటలకు శ్రీ  సుదర్శన హోమం, అనంతరం ఉ.

11 గంటలకు  చక్ర తీర్థం. సాయంత్రం 5.30 గంటలకు చతుఃస్థానార్చన, 6.30 కు కరియామిని కృష్ణ చే గాత్ర కచేరీ, 

మే 13 వ తేదీ ఉదయం 7.30 గంటలకు పంచవింశ ( 25 ) కలశ స్నపన, గిరిజ రాణి బృందం చే కోలాటం, మధ్యాహ్నం తదియారాధనం,  సాయంత్రం 5.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, మంగళాశాసనం తో కార్యక్రమాలు

ముగుస్తాయి. 

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కార్యక్రమాల అనంతరం తీర్ధప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు ఆలయ అర్చకులు ను 94400 61940 నెంబర్ లో సంప్రదించవచ్చన్నారు.   
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam