DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి కోసం ప్రచార భాద్యతలు కూడా మోస్తున్న ట్రస్టీ 

*వేలు ఖర్చు చేస్తున్నా సింహాచలం లో పిఆర్ఓ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్.*

*ఆలయ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్  కు ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు అభినందనలు* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, మే 11, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం లో వెలసిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం లో

ప్రచార విభాగం ( పి ఆర్ ఓ) వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఆలయ అభివృద్ధి కోసం ఓ ట్రస్టీ ఆ భాద్యతలను నెత్తిన వేసుకున్నారు. ఆలయం లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని పత్రికల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ఆలయ ఈఓ నెలకు రూ. 75 వేలు ఖర్చు చేస్తూ ఇద్దరినీ నియమించారు. వారిలో కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే పూర్తి

స్థాయి విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కార్యక్రమ వివరాలను తెలియచేస్తూ వార్తలు విడుదల చెయ్యవలసిన పి ఆర్ ఓ మీడియా కె కానరాని పరిస్థితులు సింహగిరిపై నెలకొన్నాయి. 

అయితే ఎంతో ఖ్యాతిగాంచిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయానికి ప్రచారం లేకపోవడం గమనించిన ఆలయ ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు ఆ ప్రచార భాద్యతలను

తన నెత్తిన వేసుకున్నారు. వీరు పాత్రికీయ రంగంలో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కనీసం వార్త కూడా వ్రాయడం రాని వ్యక్తులకు అత్యంత భాద్యతయుత పదవిలో కూర్చోబెట్టడం ఆలయ ఈఓ చేసిన పెద్ద తప్పిదంగా మీడియా వర్గాలు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదే విషయం ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు వద్ద ప్రస్తావించగా, తానూ

సింహాచలం గ్రామవాసినని, తనకు చిన్న నాటి నుంచి ఆలయంతో అనుబంధం ఉన్నందున, గత రెండు దశాబ్దాలుగా తాను పదవిలో ఉన్నా లేకున్నా ఆలయ ప్రచారాన్ని నిర్వహిస్తున్నానని తెలిపారు. మన ప్రాంతంలోని అత్యంత ప్రఖ్యాత ఆలయాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు స్వామి తనకు ఈ అవకాశం కల్పించినట్టు భావిస్తున్నామన్నారు. 

ఆలయ

పిఆర్ఓ వ్యవస్థ వైఫల్యం పై మాట్లాడుతూ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అత్యంత నిష్టగా, అత్యంత క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఆలయ ఫోటోగ్రాఫర్ తెంటు శ్రీనివాస్ మీడియా ప్రతినిధులకు అందించడం అభినందనీయమన్నారు. అయితే పి ఆర్ ఓ వార్తలు వ్రాయడం, వ్రాయకపోవడం పై తానూ స్పందించనని తెలిపారు.  

ఇటీవల జరిగిన చందన

యాత్ర లో సైతం స్వామి నిజరూప దర్శనం వైభవాన్ని తెలియచేస్తూ మీడియా ప్రపంచానికి తాను ఎన్నో కథనాలు అందించామన్నారు. అయితే వైదిక పరంగా తనకు కొన్ని విషయాలు తెలియవని, వాటిని తెలుసుకుని, ఆలయ మర్యాదలను పాటించడం జరుగుతుందన్నారు. 

ఈ వైశాఖ పౌర్ణమి వరకూ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి గుమ్మడి పండు అలంకారంలో భక్తులకు

దర్శనం అందించనున్నారన్నారు. తదుపరి రెండవ విడత 3 మణుగుల చందనం స్వామికి సమర్పించడం జరుగుతుందన్నారు. జేష్ట పౌర్ణమికి మూడో విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆషాడ పౌర్ణమి నాడు నాలుగో విడత గా మరో మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. శ్రావణ పౌర్ణమికి కరాళ చందన సమర్పణ తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam