DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సాగుతున్న శ్రీరమ్య తిరుమల వార్షికోత్సవాలు

*(DNS Report : Acharyulu SV, Bureau Chief, Srikakulam)*

*శ్రీకాకుళం, మే 12, 2022 (డిఎన్ఎస్):*

కోరిన కోర్కెలు తీర్చే దైవం గా వేలాదిమంది భక్తులచే కొనియాడబడుతున్న శ్రీకాకుళం సిటీలోని  శ్రీ రమ్య తిరుమల లోని మహాలక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వరుడు వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 న ప్రారంభమైన ఈ ఉత్సవాలు శుక్రవారం తో

ముగియనున్నాయి. శ్రీ పాంచరాత్ర ఆగమ విధానం ప్రకారం శ్రీ రమ్య తిరుమల ఆలయ 12 వ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగతున్నట్టు ఆలయ అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు తెలియచేసారు. 

శ్రీకాకుళం సిటీ నుంచి అరసవిల్లి వెళ్లే మార్గంలో గల  ఈ ఆలయంలో శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లు నిత్యం వైభవోపేతంగా

ఆరాధనలు అందుకుంటున్నారు. 

గురువారం ఉదయం చతుఃస్థానార్చన నిర్వహించామని, తదుపరి శ్రీ  సుదర్శన హోమం ఆగమ సంప్రదాయ ప్రాకారంలో నిర్వహించామన్నారు. ఈ హోమం లో రెడ్ క్రాస్ సంస్థ శ్రీకాకుళం చైర్మన్ జగన్మోహన్ రావు పాల్గొన్నారన్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం

చక్ర తీర్థం జరిగాయని, సాయంత్రం కరియామిని కృష్ణ చే గాత్ర కచేరీ నిర్వహించారన్నారు.  

మే 9 న సోమవారం సాయంత్రం 6.00 గంటలకు శ్రీ విష్వక్సేన ఆరాధన, పుణ్యాహం, రక్షాబంధనం, ఋత్విక్ వరుణం, అంకురారోపణం తో ఉత్సవాలు ఆరంభమయ్యాయన్నారు. 

మే 10 న మంగళవారం చతుః స్థానార్చన, ఏకాశీతి (81) కలశస్నపనము (అభిషేకం), సాయంత్రం

గజవాహన సేవ (తిరువీధి), శ్రీ నారసింహ హోమం నిర్వహించామన్నారు.  

మే 11 న బుధవారం చతుఃస్థానార్చన, నిశా చూర్ణోత్సవం పసుపు దంచుట, శ్రీ లక్ష్మి హోమం, కళ్యాణ మహోత్సవం ఘనంగా చేపట్టామన్నారు. 

వేడుకల్లో చివరి రోజైన మే 13 వ తేదీ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు పంచవింశ ( 25 ) కలశ స్నపన, గిరిజ రాణి బృందం చే కోలాటం, మధ్యాహ్నం

తదియారాధనం,  సాయంత్రం 5.30 గంటలకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, మంగళాశాసనం తో కార్యక్రమాలు ముగుస్తాయని వివరించారు.  

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కార్యక్రమాల అనంతరం తీర్ధప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు ఆలయ అర్చకులు ను 94400 61940 నెంబర్ లో సంప్రదించవచ్చన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam