DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 14 నుంచి జంగారెడ్డి గూడెంలో 20 వ శ్రీ అష్టలక్ష్మీ యాగం

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, మే 14, 2022 (డిఎన్ఎస్):* అనకాపల్లి జిల్లా కొప్పాక లోని చెందిన శ్రీ అష్టలక్ష్మీ పీఠం నిర్వాహకులు పీతాంబరం రఘునాధాచార్యుల నేతృత్వంలో శనివారం నుంచి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో 20వ శ్రీ అష్టలక్ష్మీ యాగం జరుగనుంది. ఈ సందర్బంగా ఆయన ఈ యాగ నిర్వహణ వివరాలను తెలియచేసారు.

 ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో గత 20 ఏళ్లుగా ఈ యాగాలను నిర్వహిస్తున్నామన్నారు. 

ప్రస్తుతం జంగారెడ్డి గూడెం లోని ఆర్టిసి బస్టాండ్ ప్రక్క వీధిలో, గర్ల్స్ హైస్కూల్ దరి  గద్దె లక్ష్మణరావు భూ ప్రాంగణం లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

18 న రాత్రి 8.25

ని.లకు గోకుల తిరుమలగిరి పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు, త్రిదండి చిన జీయర్ స్వామి వారి శిష్యులు నల్లూరు రవికుమారాచార్యుల కు "అర్చకరత్న" అవార్డు పురస్కారము అందించనున్నామన్నారు. 

ది. 20-5-2022 శుక్రవారం రాత్రి 8.25 ని.లకు : లోకకళ్యాణార్ధం శ్రీ అష్టలక్ష్మీయాగాలను

నిర్వహిస్తున్న శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి తల్లిదండ్రులు పీతాంబరం వేణుగోపాలాచార్యులు - వెంకట రమణమ్మ గార్ల జ్ఞాపకార్థం శాస్త్ర విద్వన్ మణి  ఉ. వే. అమరవాది వెంకట నర్సింహాచార్య స్వామి, విజయశ్రీ లకు మాతృదేవోభవ అవార్డు ప్రదానం జరుగుతుందన్నారు.
 
ది.21-5-2022, శనివారం రాత్రి 8.15 ని. లకు. ఋగ్వేద పండితులు సందుగుల

లక్ష్మణాచార్యులు, సందుగుల అర్చన లకు దీపోత్సవ శుభ సమయంలో వేదజ్యోతి అవార్డు ప్రధానోత్సవము అందించనున్నట్టు తెలియచేసారు. 

శ్రీ అష్టలక్ష్మీ యాగంలో జరుగనున్న నిత్య కార్యక్రమాలు: 

ఆరాధనలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు

జరుగుతాయన్నారు.  పెరుమాళ్ ఆరాధన, అర్చనలు, హోమాలు, పెద్దల ప్రవచనాలు, భజనలు, కుంకుమార్చనలు, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుందన్నారు.  

14 న సాయంత్రం శోభాయాత్ర, 15 న విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, నరసింహ ఇష్టి, 16 న విశ్వక్సేన ఇష్టి,  17 న శ్రీ హనుమత్ ఇష్టి, 18 న సుదర్శన ఇష్టి, 19 న విద్యార్థులకు శ్రీహయగ్రీవ మంత్రోపదేశం, 20 న 108

కలశలతో శ్రీ లక్ష్మి నారాయణ పెరుమాళ్ళకు అభిషేకం, 21 న రాత్రి 7.15 గంటలకు శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్లకు దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. 

ఈ నెల 18 న అర్చక స్వాములకు సత్కారం, 22 న ఆసక్తిగల భక్తుల మంత్రోపదేశం ( సమాశ్రయణములు ) శ్రీ వైష్ణవ దీక్ష అందించడం జరుగుతుందన్నారు. 
23 న సోమవారం, ఉదయం 11 గం.30 ని.లకు

మహాపూర్ణాహుతి నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణుల శాంతి కళ్యాణం తో ఈ యాగం పరిసమాప్తి అవుతుందన్నారు. 

ఇంతవరకూ తమ పీఠం ఆధ్వర్యవం లో 1) గజపతి నగరం 2) కొండకొప్పార వరం 3) చోడవరం 4) బొబ్బిలి 5) తుని 6) తణుకు 7) ఏలూరు 8) సింహాచలం 9) గుంటూరు (భద్రాచలంలో శ్రీరామమహాయజ్ఞం) 10) ఒంగోలు 11) శ్రీకాకుళం 12) రాజమండ్రి 13)

ఖమ్మం 14) అనంతపురం 15) చింతలపూడి 16) మంగళగిరి 17) విజయనగరం 18) తాడేపల్లి గూడెం 19) కాకినాడ  పట్టణాల్లో నిర్వహించామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam