DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇదీ ఢిల్లీ లో హిందూ వ్యతిరేక పాలకులు, మీడియా పనితీరు.

*55 మందిని రక్షించిన ఆ క్రేన్ ఆపరేటర్ కి కనీసం గుర్తింపు లేదు.*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 16, 2022 (డిఎన్ఎస్):* ఈ దేశంలో హిందూ వ్యతిరేక పాలకులు, కేవలం ఒక వర్గానికి, కొమ్ము కాస్తూ , హిందూ సమాజంపై విషం చిమ్మే మీడియా సంస్థల బుద్ది బయట పడిన సందర్భం దేశ రాజధానిలో

వెలుగు చూసింది. తనకు ఏ మాత్రం సంబంధం లేకున్నా కేవలం మానవతా దృక్పథం తో ప్రాణాలకు తెగించి 55 మందిని కాపాడిన వ్యక్తి ని అభినందించలేదు సరికదా కనీసం గుర్తించక పోవడం దురదృష్టకరం అని నెటిజన్లు మండిపడుతున్నారు. అతని ప్రస్తావన కూడా ఎవరూ చెయ్యడం లేదు. ఎందుకంటే అతను ఒక హిందూ. మీడియా కళ్ళు మూసుకుని కూర్చుంది. వివరాల్లోకి

వెళితే. . .

మూడు రోజుల క్రితం ( ఈ నెల 13 న ) దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా లో బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసినదే. ఈ ఘటనలో చాలమంది చనిపోయారు కూడ. అయితే చాలామంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటకు వచ్చారు కూడా. అయితే వాళ్ళందరూ ఎవరికీ వారు బయటకు రాలేదు. ఒక వ్యక్తి అత్యంత సాహసోపేతంగా తన ప్రాణాలను

పణంగా పెట్టి మరీ 55 మందిని ప్రమాదం నుంచి రక్షించారు. ఆ హీరో నే దయానంద్ తివారీ. అతను ఒక క్రేన్ ఆపరేటర్. తనకు  సంబంధం లేకపోయినా ఆ  ప్రమాదం చిక్కుకున్న వీళ్లందరినీ కాపాడారు. 

ఈ ఘటనపై అతని మాటలలో  " తాను ముండ్కా ఉద్యోగ్ నగర్ నుండి వస్తున్నాను. దారిలో ఒక బిల్డింగ్ లోనుండి మంటలు రావడం చూశాను. వెంటనే నేను నా

క్రేన్ ను ఆబిల్డింగ్ వైపు పోనిచ్చాను. ఆ మంటలలోనుండి 55మందిని రక్షించాను.’ కానీ మంటలు విపరీతంగా పెరిగి పోయాయి." 

ఒక గంటన్నర తరువాత ఫైర్ ఇంజన్ లు వచ్చాయి. అప్పటికే చాలమంది కాలిపోయారు. మరింత మందిని రక్షించలేకపోయినందుకు బాధగా ఉంది’. ఇతను చేసిన మహోన్నతమైన పనికి సర్వత్రా అభినందనలు లభించాల్సి ఉంది. అయితే

ఇతను కేవలం  హిందూ అనే ఒకే ఒక్క కారణం వల్ల పాలకులు గానీ, హిందూ వ్యతిరేక మీడియా గానీ ఇతన్ని కనీసం పట్టించుకోక పోవడం వీళ్ళ గొప్పతనానికి వదిలెయ్యాలి.

సమాజాన్ని బ్రస్తు పట్టించే వార్తలను, సినిమాల గురించి, ప్రేక్షకులు తిడుతున్నా సరే  అదే పనిగా రోజుల తరబడి మరీ వాయించే ఈ మీడియా చానెళ్లు, సమాజానికి మేలు చేసిన

ఒక క్రేన్ ఆపరేటర్ గురించి  ప్రసారం చెయ్యక పోవడం గమనార్హం. 
అయితే ఆ  అగ్ని ప్రమాదం గురించి మాత్రం ప్రసారం చేసిన మీడియా కి ఆ ఘటన నుంచి 55 మందిని రక్షించిన వ్యక్తి కనపడకపోవడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam