DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేదవిద్యా సంరక్షణకై అహరహం కృషి చేస్తున్న ఋషి వీరే. . 

*మా జీవితం వేదరక్షణకై అంకితం: సప్తఋషి వేదపాఠశాల మాధవశర్మ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 23, 2022 (డిఎన్ఎస్):* ఆధునిక జీవితంలో ఎన్నో వ్యక్తిగత ఆర్భాటాలకు అలవాటు పడుతున్న సమాజానికి ఎదురొడ్డి సంప్రదాయ వైదిక వేద  విద్యను భావితరాలకు అందించాలి అని కృషి చేస్తున్న

ఋషి మావిళ్ళపల్లి మాధవ శర్మ. విశాఖ జిల్లా సబ్బవరం గల తమ సొంత స్థలంలోనే సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఒక వేదపాఠశాలను నిర్వహిస్తున్నారు. తానూ అభ్యసించిన విద్యను పదిమంది  చేసారు.  న్నారులకు అందించి వేదమాతకు సగౌరవ వందనం సమర్పించాలని సంకల్పించారు. ఇదే ప్రాంగణంలో వేదపాఠశాలలో పాటు గోశాలను, నిత్యా అన్న ప్రసాద శాలను

సైతం ఏర్పాటు చేసారు. గత కొన్నేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, ఆర్థికపరమైన ఉప్పెనలను సైతం దాటుకుంటూ ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. భయంకరమైన కొరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సైతం తమ అన్న ప్రసాద శాల నుంచి నిత్యం ప్రజలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసారు. 

కఠోర నిర్దుష్ట

సంకల్పం: ., . .

అంతరించిపోతున్న వేద సంస్కృతికి ప్రతిఒక్కరూ కృషి చెయ్యాలి. ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబంలో ఒక వేద పండితులుగా తయారవ్వాలి. తద్వారా వేద సంపద భవిష్యత్తరాలకు అందించడమే కాకుండగా బ్రాహ్మణజాతికి మనుగడ లభిస్తుంది. యావత్ ప్రపంచం వేద సంస్కృతిని విస్తరింపజేసి వేద విజ్ఞానం ద్వారా భారతదేశ సంపదగా

గుర్తింపు లభిస్తుంది అని ధృడ నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు మాధవశర్మ.

వేదవిద్య కోసం జీవితాన్నే పణంగా . . .

వేదవిద్య ను ఎక్కువమంది చిన్నారులకు అందించాలి అనే సంకల్పంతో వేదప్రచారం కోసం శంకర విజయ యాత్ర ను చేపట్టి భారత దేశంలోని ఎన్నో ప్రాంతాలను పర్యటించి, అక్కడ వేద పారాయణము నిర్వహించారు. ఈ యాత్ర ఒక

సాహసోపేతమైనదిగా చెప్పవచ్చు. ఇంతవరకూ ఏ వేదపాఠశాల నిర్వాహకులు  ఈ  విధమైన శంకర విజయ యాత్రను  నిర్వహించినట్టుగా లేదు. దక్షిణ భారత నుంచి ఉత్తర భరతం వరకూ అన్ని ప్రాంతాల్లోనూ వేదవాక్కును తమగళం ద్వారా వినిపించిన మహనీయులు మాధవశర్మబృందం. 

ఈ పాఠశాలలో నాలుగు వేదాల్లోని  ప్రఖ్యాత శాఖలను నేర్పించడం

జరుగుతోంది. ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదంలో శౌనక శాఖ ల్లో నిష్ణాతులైన వేద అధ్యాపకులచే గురుకుల విద్యాభ్యాసం నిర్వహిస్తున్నారు. ఈ విధమైన విద్య విధానం తో పాటు ఆధునిక విద్యను, సాంకేతిక విద్యను కూడా చిన్నారులకు అందించాలి అనే తపనతో తానూ నేర్చుకుని, వారికి శిక్షను

అందింపచేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ పాఠశాలలో నూతనంగా విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. వేద విద్య అభ్యాసానికి తమ గురువులు అమలు చేసిన నిబంధనాలనే వీరు కూడా పాటించడం గమనార్హం. 

సప్తఋషీ వేద పాఠశాలలో చేరదలచిన విద్యార్థులకు ఉండవలసిన అర్హతలు & నియమ నిబంధనలు

1. వేద

విద్యార్థి ఖచ్చితంగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారై ఉండాలి.

2. వేద పాఠశాలలో గురువుల యందు, పెద్దలయందు గౌరవ భావంతో కలిగి ఉండాలి.

3. ఆహారనియమాలు పాటిస్తూ.. సంప్రదాయ మడి, ఆచారాలతో కూడిన క్రమశిక్షణ కలిగి ఉండాలి.

4. వేద పాఠశాల యాజమాన్యముచే నియమించిన కాలపట్టిక అనుసరిస్తూ విద్యార్థులు దినచర్య

కొనసాగించాలి.

5. విలువైన వస్తువులు, డబ్బులు, మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వేద పాఠశాలలో విద్యార్థులయందు ఉండరాదు.

6. ఒక్కసారి పాఠశాలలో చేరినయెడల విద్య పూర్తియగునంతవరకు వేదపాఠశాల విడిచి వెళ్ళరాదు

7. వేదవిద్యతో పాటుగా విద్యార్థికి కావలసిన సాధారణ విద్య మరియు 12వ తరగతి వరకు

ఎకాడమిక్ కోర్సు, కంప్యూటర్ కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి విద్యలు నేర్పించబడును.

8. విద్యార్థి నుండిగాని, తల్లిదండ్రులయందుగాని పాఠశాలయాజమాన్యం ఒక్కరూపాయి కూడా వసూలు చేయదు.

పైన చెప్పబడిన నియమాలతో విద్యార్థి వేద విద్య నేర్చుకొనుటకు సమ్మతమైతే విద్య పూర్తియగునంతవరకు

ఉచిత భోజన, వసతి, వస్త్ర, పుస్తక మరియు సకల సదుపాయాలను సంస్థ బాధ్యత వహిస్తూ, వేద విద్యార్థిని పూర్తిస్థాయిలో వేద పండితునిగా తీర్చిదిద్ది వేద సంరక్షణ చేస్తూ, సప్తఋషీ వేద పాఠశాలను స్థాపించి ఎంతోమంది వేద విద్యార్థులను వేద పండితులుగా తయారు చేస్తున్నారు.

పాఠశాల లో విద్యార్థులను చేర్పించేందుకు, పాఠశాలలో జరిగే

వివిధ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ఇతర వివరాలకు ఆశ్రమ నిర్వాహకులను ఈ మొబైల్ నెంబర్ల (9492341294 , 81791 63833 ) లో సంప్రదించవచ్చు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam